NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌ను కెలికి జ‌గ‌న్‌ను కామెంట్ చేసిన బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఇర‌కాటంలో ప‌డేసిన అంశం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన సంస్క‌ర‌ణ‌లు అమ‌లు విష‌యంలో విప‌క్షాలు టార్గెట్ చేస్తున్నాయి.

తాజాగా మ‌రో విమ‌ర్శ‌తో తెలుగుదేశం ఏపీ ముఖ్య‌మంత్రిని టార్గెట్ చేసింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తిరస్కరించిన నగదు బదిలీని జగన్ మోహ‌న్ రెడ్డి ఎందుకు చేపట్టారు అని తెలుగుదేశం పార్టీ ప్ర‌శ్నించింది.

ఆవు తోలు క‌ప్పుకొన్న పులి…
టీడీపీ ముఖ్య‌నేత‌, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై కొత్త విమ‌ర్శ చేశారు. `ఆవు తోలు కప్పుకున్న పులి` వంటిది నగదు బదిలీ పథకం అని విమ‌ర్శించారు. అవినీతి స్కీముల కోసం అతిగా అప్పులు చేయడానికే నగదు బదిలీ పథకాన్ని చేపట్టారని విరుచుకుప‌డ్డారు. రైతులు, దళిత, బలహీన వర్గాలను నిండా ముంచే ప‌థ‌కం అని దుమ్మెత్తి పోశారు. దేశంలో అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని తిరస్కరించిన ప‌థ‌కాన్ని జ‌గ‌న్ స‌ర్కారు అమలు చేస్తోంద‌ని ఆక్షేపించారు.

అవి త‌గ్గించుకో జ‌గ‌న్‌…
అవినీతి, దుబారా తగ్గించుకుంటే ఇప్పుడు వస్తున్న ఆదాయంతోనే జీతాలతో పాటు పథకాలన్నీ సజావుగా నడపవచ్చని కాలువ శ్రీ‌నివాసులు పేర్కొన్నారు. “2020 జూన్ నెలలో కరోనా ఉన్నా రాష్ట్ర పన్నుల ఆదాయం రూ. 5,785 కోట్లు వచ్చింది. ఇది 2018-19 లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ. చంద్రబాబు ఏడాదికి సరాసరి రూ.26 వేల కోట్లు అప్పు చేస్తే జగన్ రూ.63 వేల కోట్లు అప్పు చేశారు.  వీటితోనే జీతాలతో సహా అన్న స్కీములు సజావుగా నడపవచ్చు.  “ అని తెలిపారు.

జ‌గ‌న్ స్కెచ్ వేరేన‌ట‌

మరింత ఎక్కువగా అప్పు చేయడానికి జగన్ ప్రభుత్వం ఊరకలు వేస్తోందని కాలువ శ్రీ‌నివాసులు ఆరోపించారు. “ అప్పుల కోసం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడవబోతున్నది.  పేదలు, రైతులకు వ్యతిరేకమైన నగదు బదిలీ పథకానికి ఆవు తోలు కప్పే ప్రచారం చేస్తున్నారు. నగదు బదిలీని సీఎం పొగడడమే కాక తెలుగుదేశం పై అబద్దపు ప్రచారానికి దిగారు. 2014లో 22.5 మిలియన్  యూనిట్ల లోటుతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. రోజుకు 10 గంటలకు పైగా కరంటు కోతలు ఉండేవి. అంతేగాక, గత ప్రభుత్వ బాకాయిలు రూ.32 వేల కోట్ల కట్టాల్సి వచ్చింది. ఇందులో విద్యుత్ బకాయిలు రూ.8 వేల కోట్లుకు పైగా చెల్లించాల్సి వచ్చింది. ఇచ్చిన కొండంత ఆస్థి గురించి చెప్పకుండా గోరంత అప్పుని కొండంతగా దుష్ప్రచారం చేస్తూ తమ నగదు బదిలీ పథకంలోని మోసాన్ని కప్పి పెట్టుకునే కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారు.“ అని ఆరోపించారు.

సీమ‌కు ద్రోహం?

పంపుసెట్లును అధికంగా ఉపయోగించే రాయలసీమలో నగదుబదిలీని ప్రవేశపెట్టడం వల్ల రాయలసీమ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కాలువ శ్రీ‌నివాసులు తెలిపారు. “ఈ నిర్ణ‌యం రాయలసీమకు అన్యాయం చేయడమే. చంద్రబాబు రైతుకు సోలార్ పంప్ సెట్ పథకం ఇచ్చారు. లక్షల రూపాయిల సబ్సిడీ ఇచ్చారు. రైతు అవసరం పోగా మిగులు విద్యుత్ గ్రిడ్ కు అమ్మి లాభం పొందే అవకాశం కల్పించారు. నేడు జగన్ 10 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ పేరుతో రూ. 2 వేల కోట్లు కమీషన్ కొట్టేయడానికి పథకం వేశారు. ఇలాంటి అవినీతి పథకాలకు మితిమీరి అప్పు చేసేందుకే నగదు బదిలీ పథకానికి అంగీకరించి రైతు ఆత్మహత్యలు పెరిగే విధంగా చేస్తున్నారు.  రైతుల్ని, పేదల్ని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు.“ అంటూ విరుచుకుప‌డ్డారు.

author avatar
sridhar

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N