నారా రోహిత్….తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు తెలిసిందే!బాణం, సోలో, అసుర, రౌడీ పోలీస్ వంటి హిట్ సినిమాలతో ఆయన కొన్నాళ్లు టాలీవుడ్ లో వెలిగారు.
అయితే ఆ తర్వాత ఆయన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో వెండితెరపై వెలుగు కోల్పోయ్యారు.ప్రస్తుతం దాదాపు ఆయన ఖాళీగానే ఉన్నారని చెప్పవచ్చు.దీంతో ఆయన కన్ను రాజకీయాలపైన పడిందట.ఇవ్వాళో రేపో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని టాక్!అదేమీ ఆయనకు పెద్ద విషయం కాదు!పైగా వెంటనే చేరిపోవడానికి టిడిపి ఆయనకు అందుబాటులో ఉంది !ఎందుకంటే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రోహిత్ కి స్వయాన పెదనాన్న!రోహిత్ తండ్రి నారా రామ్మూర్తినాయుడు చంద్రబాబునాయుడు స్వయాన సోదరులు.రామమూర్తినాయుడు కూడా మాజీ ఎమ్మెల్యేనే!1994 లో ఎన్టీఆర్ ఆయనకు చంద్రగిరి సీటిస్తే గెలిచారు.
ఆ తరువాత తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్న చంద్రబాబునాయుడు మాత్రం రామ్మూర్తినాయుడు కి 1999 లో సీటివ్వకపోవడం వేరే విశేషం!అంతేగాక రామ్మూర్తి నాయుడు రాజకీయంగా ఎదగకుండా చంద్రబాబే చేశాడని ఒక టాక్ కూడా ఉంది.జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఒక టీవీ షోలో ఇదే విషయాన్ని చెప్పారు. సొంత సోదరుడు అనారోగ్యంపాలై మంచం పట్టినా పట్టించుకోని మనిషి చంద్రబాబు అని ఆయన దుమ్మెత్తి పోశారు.అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబే చొరవ తీసుకుని రోహిత్ ని పార్టీలోకి తెస్తున్నారని చెపుతున్నారు.
దీన్ని కొన్ని కారణాలు కూడా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు సొంత కుమారుడు లోకేష్ శక్తి సామర్థ్యాలు శంకించేవిగా ఉండడం,ఏ మాత్రం అవకాశమున్నా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పార్టీ పగ్గాలు లాక్కునే ప్రమాదం పొంచి ఉండడం చంద్రబాబును కలవర పెడుతున్నాయట.దీంతో రోహిత్ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా రోహిత్ తో లోకేషు కి తోడ్పాటు అందించాలన్నది చంద్రబాబు ప్లాన్.ఇది ఓ రకంగా టీడీపీని, తిరిగి నందమూరి కుటుంబం చేతుల్లోకి వెళ్ళనీయకుండా చేసే వ్యూహమన్న వాదనలూ లేకపోలేదు.ఏదేమైనప్పటికీ యూజ్ అండ్ త్రో రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు విషయంలో రోహిత్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు.