White Fungus: ప్రస్తుతం భారతదేశంలో అనేక మంది కోవిడ్ పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకుతున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఎంతో మంది ఆసుపత్రి ఫాలో అవుతుంటే మరి కొంతమంది చనిపోతున్నారు కూడా. అయితే ఇప్పుడు భారతదేశంలో కి ‘వైట్ ఫంగస్; అనే మరొక రకమైన వ్యాధి ప్రవేశించింది. బీహార్లో వైట్ ఫంగస్ కేసులు కొన్నింటిని వైద్య నిపుణులు కనుగొన్నారు.
ఏ అవయవాలకి ప్రమాదం?
ఇక విషయానికి వస్తే… ఈ వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనది అని డాక్టర్లు చెబుతున్నారు. వైట్ ఫంగస్ సోకిన వారికి ఊపిరితిత్తులతో పాటుగా గోర్లు, చర్మం, ఉదరం, మెదడు, కిడ్నీలు, నోరు.. ఇలా అన్నింటికి ఇన్ఫెక్షన్ సోకుతుంది.
ఎవరికి రిస్క్ అంటే…
ఇక ఈ వైట్ ఫంగస్ వల్ల రిస్క్ లో ఉన్న వారు ఎవరు అంటే… తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారు, డయాబెటిస్ అనగా షుగర్ వ్యాధి ఉన్నవారు… అలాగే ఎయిడ్స్ తో బాధపడుతున్న వారితో పాటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వారికి కూడా ఇది సోకే ప్రమాదం ఉంది.
ఈ తప్పు చేస్తే ఫంగస్ సోకుతుంది
ఆక్సిజన్ సిలిండర్ లకి ఉండే హ్యుమిడిఫయర్ (Humidifier) లో సాధారణంగా అందరూ ‘ట్యాప్ వాటర్’ (Tap Water) ను వాడుతారు. ఈ వాటర్ లో వైట్ ఫంగస్ ఉండే అవకాశం ఉంటుంది. అది ఆక్సిజన్ సపోర్ట్ ద్వారా మనిషి శరీరంలో ప్రవేశించి మొదట ఊపిరితిత్తులు పైన దాడి చేస్తుంది.
సోకకుండా ఏం చేయాలి?
సీటీ స్కాన్, ఎక్స్రే ద్వారా ఈ వైట్ ఫంగస్ ను గుర్తించవచ్చు. కాబట్టి వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్లు వాడే ముందు వాటిని శుభ్రంగా స్నానం చేయడం తప్పనిసరి. ఇలా జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం బ్లాక్ ఫంగస్ లాగానే ఈ వైట్ ఫంగస్ కూడా ఘోరంగా వ్యాపిస్తుంది.