White Hair: వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్య తెల్ల జుట్టు.. వయసు మీద పడ్డాక తెల్ల వెంట్రుకలు రావడం సాధారణం.. అయితే చిన్న వయసులో కూడా తెల్ల జుట్టు వస్తోంది.. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్లోనూ తెల్ల జుట్టు వస్తుంది.. దీని వలన మానసికంగా బాధపడుతున్నారు. వయసు పైబడేకొద్దీ, జన్యు పరంగా సంక్రమించిన లక్షణాలు దీనికి కారణాలు. మానసిక ఒత్తిడి కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. మెలానోసైట్స్ అనే మూల కణాల వలన ఇది వస్తుంది. తెల్లబడిన జుట్టుకు హెయిర్ ప్యాక్, డ్రై ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ అవి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుంది.. ఆయుర్వేదంలో తెల్ల జుట్టు కు అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. వాటిని కొన్ని రోజులు పాటిస్తే శాశ్వత పరిష్కారం పొందవచ్చు.. తెల్ల జుట్టు నల్లగా మారటానికి చుర్నాన్ని, హెయిర్ ఆయిల్ తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం..!! ఈ చిట్కాలు పాటిస్తే తెల్ల జుట్టు నల్లగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!! ఇవి పాటిస్తే నూరు శాతం ఫలితాలు ఇస్తుంది..!!
కావలసిన పదార్థాలు:
గుంటగలగరాకు పొడి – 1 కేజీ,
ఉసిరికాయ పొడి – 1 కేజీ.
ముందుగా గుంటగలగరాకును సేకరించి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి అందులో విత్తనాలను తీసి ఎండపెట్టాలి. ఇలా ఎండపెట్టిన ఉసిరికాయలను పొడి చేసుకోవాలి. ఈ రెండు పొడులను సమపాళ్లలో తీసుకుని కలుపుకొని ఆ పొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న చుర్నాన్ని ఉదయం తినక ముందు ఒక స్పూన్ , రాత్రి తిన్న తర్వాత రెండు స్పూన్స్ వేసుకొని నీళ్లు తాగాలి. ఇలా చేయడం వలన తెల్ల జుట్టు వెంట్రుకలు నల్లగా మారతాయి. ఇలా 2 నెలలు వాడితే ఫలితాన్ని మిరే గమనించవచ్చు.
గోవు మూత్రం – 5 లీటర్లు , గుంటగలగరాకు రసం – 5 లీటర్లు , పచ్చి బోడరసం – 2 లీటర్లు , ఎర్ర ముద్ద మందారం పూల రసం – 2 లీటర్లు నువ్వుల నూనె – ఒకటిన్నర లీటర్లు. ముందుగా గుంటగలగరాకు తీసుకొచ్చి శుభ్రం చేసి ఆకులను మిక్సీ పట్టి రసం తీసుకోవాలి. అలాగే పచ్చి బోడ ఆకులను తీసుకొచ్చి శుభ్రం చేసి ఆకులను మిక్సీ పట్టి రసం తీసుకోవాలి. ఎర్ర ముద్ద మందారం పూలను కోసి మిక్సీ పట్టి రసం తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో పైన చెప్పుకున్న మోతాదులో గోవు మూత్రం , గుంటగలగరాకు రసం , పచ్చి బోడరసం, ఎర్ర ముద్ద మందారం పూల రసం పోయాలి. ఇందులో నువ్వుల నూనె పోసి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. మరిగాక మిగిలిన నూనెను వడపోసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న తైలాన్ని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె ను తెల్ల వెంట్రుకలు ఉన్న చోట, తెల్లగా ఉన్న మీసాలకు, గడ్డానికి రాసుకోవాలి. కుంకుడుకాయ, శీకాయ తో లేదంటే ఆయుర్వేద షాంపూ తో తలస్నానం చేయాలి.
వెల్లుల్లి పొట్టు ఒక పావు కేజీ తీసుకొని పెనం మీద కొంచెం కొంచెం గా వేడి చేస్తూ నల్లగా మాడెలా చేయాలి. ఇలా మాడిన వెల్లుల్లి పొట్టు కి 5 రేట్లు ఆలివ్ ఆయిల్ కలపాలి. ఇలా తయారుచేసుకున్న నూనెను రాత్రి తలకు రాసుకుని ఉదయం శీకాయ, కుంకుడుకాయతో లేదంటే ఆయుర్వేద షాంపూ తో తలస్నానం చేయాలి. ఇలా 2 లేదా 3 నెలలు వాడితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇలా ఇది వాడుతూనే ప్రతిరోజు ఒక స్పూన్ ఉసిరికాయ పొడిని నీళ్లతో కానీ పాలతో కానీ తాగాలి.