మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది.. నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లిపీటలెక్కే సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 9న బుధవారం రాత్రి 7.15 ని.లకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరగనుంది.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దగ్గరి బంధువులను, సన్నిహిత మిత్రులకు మాత్రమే ఆహ్వాన పత్రికలు అందించారు. ఆహ్వాన పత్రికలు కూడా అందర్నీ అలరించాయి.కాగా నిహారిక పెళ్లికి టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్లకి ఆహ్వానం వచ్చిందట. ఇంతకీ ఆ ముద్దుగుమ్మలెవరనుకుంటున్నారా..!వారే సొట్ట బుగ్గల సింగారి ,సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ లావణ్యత్రిపాఠి, పెళ్లిచూపులు హీరోయిన్ రీతూవర్మ. వీరిద్దరికీ నీహారికకు అంత సన్నిహత సంబంధాలు ఏమిటని తలగోక్కుంటున్నారా?ఏమీ లేదండి … లావణ్య…నిహారిక జిమ్ మేట్స్. ఇక నిహారిక, రీతూవర్మ సినిమాల్లోకి రాకముందు నుంచే ఫ్రెండ్స్. దీంతో వారిద్దరికీ నిహారిక వెడ్డింగ్ ఇన్విటేషన్ ను అందించిందట.
ఈ వెడ్డింగ్‌కి ఆహ్వానం అందిన రీతూ, లావణ్య విమానంలో వెళ్తున్న ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.అయితే కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించిన నిహారిక తన రీల్ లైఫ్ హీరోలెవరికయినా ఇన్విటేషన్ ఇచ్చింది లేనిదీ తెలీలేదు.ఇప్పటికే నిహారిక తన కుటుంబంతో ఉదయపూర్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లారు. ఇక మెగా ఫ్యామిలీ అంతా అక్కడ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. సంగీత్ కార్యక్రమంలో మెగా కుటుంబ సభ్యులు ఊత్సాహంగా పాల్గొన్నారు. వివాహ బంధంతో ఒక్కటికానున్న నిహారిక చైతన్య జంట చిరు పాటకు చిందులేశారు.
చిరు నటించిన మూవీ ‘బావగారూ.. బాగున్నారా!’ లోని ‘ఆంటీ కూతురా అమ్మో అప్సరా’ పాటకు ఈ జంట వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.నిహారిక తండ్రి నాగబాబు తన ముద్దుల కూతురు వివాహ వేడుకను నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేశారు.ఇక పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి హద్దులన్నీ చెరిపేసి నిహారిక పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారట.అలాగే రామ్ చరణ్ ,వరుణ్ తేజ్ ,సాయిధరమ్ తేజ్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదని టాక్.