NewsOrbit
న్యూస్

విప్లవం : ఎవరు ఈ జార్జ్ ఫ్లాయిడ్ ? అతని గతం ఏంటి ?

అగ్ర రాజ్యం అమెరికా ఒక పక్క కరోనా విజృంభణ, మరో పక్క నల్ల జాతీయుల నిరసనలతో అట్టుడికిపోతున్నది. ఈ నేపథ్యంలో పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జార్జ్ ఫ్లాయిడ్ పేరు మారుమోగు తున్నది. నల్ల జాతీయుడైన అతని పట్ల అమెరికాలో ఓ శ్వేత జాతికి చెందిన పోలీస్ అధికారి మే 25న కిరాతకంగా వ్యవహరించాడు. ఓ కేసుకు సంబంధించి పట్టుబడిన ఫ్లాయిడ్‌‌ను కింద పడేసి అతడి మెడ మీద మోకాలు పెట్టి నొక్కుతూ ఐదు నిమిషాల పాటు అతనిని చిత్రహింసకు గురి చేశాడు. దీంతో అతను ఊపిరాడక మృతి చెందాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమెరికాలో నల్ల జాతీయుల ఆగ్రహం పెల్లుబికింది. ప్రపంచ వ్యాప్తంగానూ దీనిపై నిరసన గళాలు వినిపిస్తున్నాయి. అసలే కరోనాతో అల్లాడుతున్న అమెరికా ఈ వివాదం కారణంగా అట్టుడుకుతోంది.

ఈ నేపథ్యంలో ఇంతకీ జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు.. అతడి నేపథ్యం ఏంటి.. అతడిని ఏ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.. అని నెటిజన్లు శోధిస్తున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ వయసు 46 సంవత్సరాలు. అతను సాధారణ కుటుంబానికి చెందిన వాడు. యుక్త వయసులో బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ ఆడేవాడు. డిగ్రీ చదువును మధ్యలో ఆపేసిన అతను.. నేరప్రవృత్తిని ఎంచుకున్నాడు. డ్రగ్ మాఫియాలో అడుగు పెట్టాడు. డ్రగ్స్‌ సరఫరా, దొంగతనం కేసుల్లో అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు.మారణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డ నేరంపై 2007లో కోర్టు ఫ్లాయిడ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అయితే జైలు నుంచి విడుదలయ్యాక మంచి మనిషిగా మారాలని భావించిన ప్లాయిడ్.. మత సంస్థ అయిన రిసరెక్షన్‌ హ్యూస్టన్‌లో చేరాడు. 2017 లో తుపాకీ హింసను విడనాడాలంటూ ఫ్లాయిడ్‌ ఓ వీడియో సందేశం ఇచ్చాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెడు మార్గం పట్టిన యువతను అతను మార్చే ప్రయత్నం కూడా చేశాడుట. క్రైస్తవ మిషనరీ ‘సాల్వేషన్‌ ఆర్మీ’లో ప్లాయిడ్‌ కొన్నాళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. కొన్నాళ్లు లారీ డ్రైవర్‌గా, ఓ డ్యాన్స్‌ క్లబ్‌లో బౌన్సర్‌గా కూడా పని చేశాడు.

అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో వ్యాపారాలు దెబ్బతినడంతో చాలా మంది అమెరికన్ల మాదిరిగానే ఫ్లాయిడ్‌ కూడా ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ నేపథ్యంలో.. ఫ్లాయిడ్ 20 డాలర్ల నకిలీ నోటుతో సిగరెట్లు కొనడానికి ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. అయితే అతని పాత నేరచరిత్రను దృష్టిలో ఉంచుకున్న పోలీస్ అతడిపై అమానుషంగా ప్రవర్తించాడు. దీనితో అతను అసువులు బాశాడు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N