Acharya : ఆచార్య .. నారప్ప.. సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి – విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అది కూడా ఒక్క రోజు తేడాతో. సాధారణంగా ఇండస్ట్రీలో ఇలా ఒక్కరోజు తేడాతో భారీ సినిమాలు రిలీజ్ అవుతుండటం చాలా కామన్. సంక్రాంతి బరిలో దాదాపు 4-5 సినిమాలు ఇలాగే పోటీ పడుతుంటాయి. అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా కారాణంగా ఇండస్ట్రీలో ముందెన్నడూ లేని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
2020 మొత్తం టాలీవుడ్ లో సినిమాలు లేకుండా గడిచిపోయింది. గత ఏడాది మార్చ్ తర్వాత బాక్సాఫీస్ వెలవెల పోయింది. మళ్ళీ డిసెంబర్ నుంచి కొత్త కళ వచ్చింది. గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలన్ని ఈ ఏడాది వరసగా రాబోతున్నాయి. ఇక్కడ ఎవరి సత్తా ఏంటో చూపించుకోవాలని బాగానే పోటీ పడుతున్నారు. కాని అన్ని సినిమాలకి సరైన రిలీజ్ డేట్ నే ఎన్నుకున్నారా అంటే మాత్రం కాదనన్న మాట వినిపిస్తోంది. కరోనా కారణం విద్యా సంస్థలన్ని మూతపడ్డాయి. కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ తో ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు.
Acharya : ఆచార్య.. నారప్ప … దర్శక, నిర్మాతలే బాధ్యులవుతారు కదా..!
దాంతో మొదటిసారి పరీక్షల షెడ్యూల్ మొత్తం తారుమారయింది. మే ఎండింగ్ వరకు స్టూడెంట్స్ అందరూ పరీక్షల మూడ్ లోనే ఉంటారు. ఈసారి ఎగ్జాంస్ అయ్యేసరిని మే చివరి వారం వచ్చేస్తుంది. అయితే ఇది చూసుకున్నారా లేదా అన్నది క్లారిటీ లేదు గాని చిరంజీవి ఆచార్య మే 13 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు చిత్ర బృందం. అలాగే వెంకటేష్ నారప్ప కూడా మే 14 న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మరి ఈ డేట్స్ లో పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే పరీక్షల ప్రభావం గట్టిగా పడే అవకాశం ఉందని ఇది ఆచార్య .. నారప్ప సినిమాల మీద గట్టి ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మరి దీనికి దర్శక, నిర్మాతలే బాధ్యులవుతారు కదా.