NewsOrbit
న్యూస్

ఉత్తరాంధ్రపై అలిగిన ఆ నేత ఎవరు ? ఎందుకు ??

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఉన్నట్టుండి ఉత్తరాంధ్రపై శ్రద్ధ తగ్గిపోయింది .ముందుగా ఈ సందర్భంగా ఆయనకు ఉత్తరాంధ్రతో ఉన్న అనుబంధాన్ని ప్ర‌త్యేకంగా చెప్పుకొని తీరాలి. రాజ‌కీయాల్లోకి రాగానే ఆయ‌న‌కు హ‌ఠాత్తుగా ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటు త‌నం గుర్తుకు వ‌చ్చింది.

Pawan Kalyan takes a dig at Andhra CM over personal remarks

 

 

అదేస‌మ‌యంలో ఆయ‌న‌కు ఇక్క‌డి కిడ్నీ వ్యాధి గ్ర‌స్థులు కూడా క‌నిపించారు. దీంతో ప‌వ‌న్‌ ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటు త‌నంపై పోరాటం చేస్తాన‌ని చెప్పారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప యాత్ర చేస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా ఉత్తరాంధ్రలో ప‌ర్య‌టించారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించారు. ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుపై ఉన్న చ‌రిత్ర‌ను తవ్వి పోశారు.


దీంతో అక్క‌డి వారందరూ కూడా ఇంకేముంది.. ఉత్త‌రాంధ్ర‌కు ఒక నాయ‌కుడు ల‌భించాడ‌ని అనుకున్నారు. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ దెబ్బ‌తో త‌మ ఓటు బ్యాంకు ఎక్క‌డ గ‌ల్లంత‌వుతుందోన‌న్న దెబ్బ‌తో శ్రీకాకుళాన్ని తిత‌లీ తుఫాన్ ముంచెత్తిన‌ప్పుడు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నేరుగా శ్రీకాకుళంలోనే మ‌కాం వేసి.. అక్క‌డే ఉన్నారు. తుఫాను సాయం అందించారు. మ‌రి ఇలాంటి ఉత్త‌రాంధ్ర ప్రేమికుడైన ప‌వ‌న్ ఇప్పుడు మౌనం ఎందుకు పాటిస్తున్నారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ మంచి చేస్తానంటే.. ఎందుకు చేయ‌మ‌ని ప్రోత్స‌హించ‌డం లేదు. విశాఖ‌లో పాల‌నా రాజ‌ధానిని ఏర్పాటు చేస్తానంటే.. ఎందుకు వ‌ద్దంటున్నారు? అనేది ప‌వ‌న్‌కు చుట్టుముడుతున్న ప్ర‌శ్న‌లు. పైగా అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని కూడా ప‌వ‌న్ డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఎందుకు ఆయ‌న ఇలా ఉత్త‌రాంధ్ర‌పై శీత‌క‌న్ను వేశారు? అనేది ప్ర‌శ్న‌. దీనివెనుక గ‌త ఏడాది ఎన్నిక‌ల ఫలితాల ప్ర‌భావం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌త ఏడాది ఎన్నిక‌ల‌లో ఉత్త‌రాంధ్ర‌లో గాజువాక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేశారు. అదేవిధంగా విశాఖ ఎంపీగా మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇంకా చాలా మంది నేత‌ల‌నే ఉత్త‌రాంధ్ర‌లో పోటీకి పెట్టారు. వీరిలో క‌నీసం స‌గంమందైనా గెలుస్తార‌ని అనుకున్నారు.చివరకు పవన్ కల్యాణే ఓడిపోయారు.అక్క‌డి ప్ర‌జానాడి ఓట్ల రూపంలో  తెలిసే స‌రికి ప‌వ‌న్ ఒక్క‌సారిగా మ‌న‌సు మార్చుకున్నార‌ని అంటున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఉత్త‌రాంధ్ర మొహం కూడా ప‌వ‌న్ చూడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. త‌న‌కు కోస్తా అయితేనే బెట‌ర్ అనుకుంటున్నార‌ని తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి. రేపు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. కోస్తాలో త‌న‌కు సీట్లు ఎక్కువ తీసుకుని ఉత్త‌రాంధ్ర‌ను బీజేపీకి గుండుగుత్తుగా ఇచ్చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.అసలు పవన్ కల్యాన్ ది నిలకడలేని మనస్తత్వం.ముందొకసారి అనంతపూర్ జిల్లాలో పోటీకి అడుగుతానన్నారు చివరకు ఏలూరన్నారు. చివరకొచ్చేసరికి భీమవరం, గాజువాకలో పోటీ చేశారు.ఫలితం మనందరికీ తెలిసిందే.అయినా రాజకీయ నాయకుడన్న వాడు ప్రజల నాడి పట్టుకోవాలి గాని వారిపై అలిగితే ఒరిగేది శూన్యమని రాజకీయ పరిశీలకులు పవన్ కల్యాణ్ కి హితవు చెబుతున్నారు.

author avatar
Yandamuri

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju