సెల్ఫ్ గోల్ చేసుకున్న ఎమ్మెల్యే ఎవరు? ఎక్కడ?

Share

టిడిపి రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మామూలుగానే మహా స్పీడ్ గా ఉండే వంశీ ఈమధ్య మాట తూలారు.

గన్నవరం నియోజకవర్గానికి నేనే ఎమ్మెల్యే.. నేనే వైసీపీ ఇన్ చార్జినంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో కలకలం రేపాయి.దీంతో 2014లో ఆయన చేతిలో ఓడి పోయిన డాక్టర్ దుట్టా రామచంద్రరావు, 2019లో పరాజితుడైన యార్లగడ్డ వెంకట్రావు లకు ఎక్కడో మండిందట.వంశీ వైసీపీకి మద్దతు తెలపడంతో అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనగానే ఉన్నారు.అయితే వెంకట్రావు వరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్ష పదవిచ్చి కొద్దిగా సంతృప్తి పరిచారు.దుత్తా రామచంద్రరావు కయితే ఇప్పటి వరకు దక్కిందేమీ లేదు. నిజానికి నిన్నమొన్నటి వరకు రామచంద్రరావు వల్లభనేని వంశీ ఒక గ్రూపుగా మెలిగారు.

యార్లగడ్డ వెంకట్రావు ఒంటరిగా మిగిలిపోయారు.తాజాగా వల్లభనేని వంశీ మాటలు నియోజకవర్గంలో చిచ్చుపెట్టాయి.ఎమ్మెల్యే, ఇంచార్జి కూడా వంశీనే అయితే ఇక మేము చేసేదేముందున్న ఆగ్రహంతో రామచంద్రరావు ,వెంకట్రావు వర్గం రగిలిపోతున్నాయట.ఏకంగా సీఎం వద్దనే ఈ పంచాయితీ తేల్చుకునేందుకు వారు రెడీ అవుతున్నారు.అంతేకాదు.. ఇన్నాళ్లు విరోధులుగా వైసీపీలో ఉన్న యార్లగడ్డ వర్గాన్ని కూడా దుట్టా వర్గం చేరదీసి వీరిద్దరూ కలిసి వంశీకి చెక్ చెప్పాలని నిర్ణయించుకున్నారని సమాచారం.ఈ క్రమంలోనే వైసీపీలోని దుట్ట, యార్లగడ్డ వర్గం కలిసిపోతున్నాయట.ఇదిలా ఉంటే వంశీ .. రమేష్ హాస్పిటల్ యాజమాన్యాన్ని తీవ్రంగా దూషించడ౦ కూడా ఆయనకు పెద్ద మైనస్ పాయింట్గా మారింది.

కమ్మ సామాజికవర్గానికి చెందిన వంశీ అదే సామాజికవర్గం వ్యక్తులపై  నోరుపారేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.. రమేశ్ హాస్పిటల్ వ్యవహారంలో హీరో రామ్ పై చేసిన కామెంట్స్ తో కమ్మ వర్గంలోనూ వంశీ మీద వ్యతిరేకత పెరిగింది. కుల ప్రస్తావన తెచ్చి వంశీ పొరపాటు చేశాడని అంటున్నారు.గన్నవరం నియోజకవర్గం కమ్మ సామాజికవర్గానికి కంచుకోట.వంశీ తాజాగా చేసిన వ్యాఖ్యల కారణంగా వైసీపీలోని రెండు వర్గాలు ఏకమయ్యాయి నియోజకవర్గంలో బలంగా ఉండే కమ్మ సామాజిక వర్గం దూరమైంది.

ఈ నేపథ్యంలో ఆయన గన్నవరంలో ఉప ఎన్నికలో పోటీ చేస్తే ఫలితం వ్యతిరేకంగా రావచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు .తాజా పరిణామాలు గమనించిన వైసిపి వల్లభనేని వంశీ కారణంగా పార్టీకి ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ జరుగుతోందని ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.ఎలా గన్నవరం తలనొప్పిని తగ్గించుకోవాలా అని పార్టీ అగ్ర నాయకత్వమే ఆలోచిస్తోంది!


Share

Related posts

ఏమాత్రం భయం లేకుండా.. తన బాడీ పార్ట్స్ గురించి ఇలియానా ఇలా చెప్పిందేంటి?

Varun G

Lime Juice: నిమ్మరసం తాగుతున్నారా ?? ఈ విషయం తెలుసుకోండి !!(పార్ట్ -2)

Kumar

December: మీరు డిసెంబర్ లో పుట్టారా? అయితే ఇది మీకోసమే!!

Kumar