NewsOrbit
న్యూస్

అదరక బెదరక వాడు మగాడురా’బుజ్జి’ అనిపించుకున్న ఎమ్మెల్యే ఎవరు?

అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ని బాగా తెలిసిన వారు బుజ్జి అంటారు. ఇప్పుడు ఆయనను వాడు మగాడ్రా బుజ్జి అని కీర్తిస్తున్నారు.

Who is the only MLA to look like hero
Who is the only MLA to look like hero

అధికార వైసీపీలో చేరాలని ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు వచ్చినప్పటికీ గొట్టిపాటి రవికుమార్ ఏమాత్రం అదరక బెదరక టిడిపిలోనే కొనసాగటంతో ఆయన గ్రానైట్ లీజులను ప్రభుత్వం ఏకంగా రద్దు చేసేసిన విషయం తెలిసిందే.నిజానికి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ రాయల్టీలు ప్రభుత్వానికి ఎగ్గొట్టిన వ్యవహారంలో దాదాపు నలభై మందికి ప్రభుత్వం జరిమానాలు విధించింది. దాదాపు 2100 కోట్ల రూపాయల మేర ఆయా కంపెనీలకు ప్రభుత్వం ఫైన్ వేయగా పలువురు గ్రానైట్ వ్యాపారులు కం రాజకీయ నాయకులు టిడిపి జెండా పీకేసి వైసిపి పంచనచేరి పోయారు.

జిల్లాలో గ్రానైట్ కింగ్గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు చీరాల టిడిపి ఎమ్మెల్యే కరణం బలరామ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.అయితే అది నుండి తనను వైసిపి వెంటాడుతున్నప్పటికీ రవికుమార్ ఏ మాత్రం అదరలేదు బెదరలేదు. కాంగ్రెస్ పక్షాన 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన గొట్టిపాటి రవికుమార్ ముందు మార్టూరులో గెలుపొందారు.2009 లో ఆ నియోజకవర్గం రద్దుకావడంతో అద్దంకి వెళ్లి అక్కడా గెలిచారు.2014 లో వైసీపీ పక్షాన అద్దంకి లోనే విజయం సాధించారు. అయితే మధ్యలో ఆయన టిడిపి తీర్థం తీసుకున్నారు.

2019 లో రవికుమార్ అద్దంకిలో టిడిపి అభ్యర్థి గా విజయం సాధించారు.అయితే వైసీపీ కన్ను మొదటి నుంచి రవికుమార్ మీద ఉంది .నయానా భయానా చెప్పి చూసి ఆయన్ను వైసీపీలోకి రప్పించడానికి పావులు కదిపారు.కానీ రవికుమార్ నుండి సానుకూల స్పందన రాకపోవడంతో జగన్ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోయింది.తమ మాట వినకుండా పార్టీలో చేరకపోవడంతో ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగింది.

ఆయనను ఆర్థికంగా నష్టపర్చే ఎత్తులు వేసింది. ఆయనను ఆర్థికంగా కట్టడి చేయాలన్నది వైసీపీ నేతల యత్నంగా కన్పిస్తుంది.అయితే రవికుమార్ తన గ్రానైట్ లీజుల రద్దుపై న్యాయపోరాటం చేయడానికి నిర్ణయించుకున్నారని ఎట్టి పరిస్థితుల్లో ఆయన వైసిపికి లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మరికొన్ని ఆసక్తికర మలుపులు తిరిగే సూచనలు గోచరిస్తున్నాయి!

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju