NewsOrbit
న్యూస్

మావోయిస్టుల్లో చేరడానికి రాష్ట్రపతి అనుమతి కోరింది ఎవరు ? ఏమా కథ?

రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసు బాధితుడు తన విషయంలో రాష్ట్రపతి జోక్యాన్ని కోరుతూ ఆయనకి నేరుగా లేఖ రాయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

Who sought the President's permission to join the Maoists What story
Who sought the President’s permission to join the Maoists What story

భారత రాష్ట్రపతి తనకు న్యాయం చేయలెని పక్షంలో తాను మావోయిస్టుల్లో చేరిపోవడానికి అనుమతి అయినా ఇవ్వాలని బాధితుడు రాష్ట్రపతి ని కోరటం ఇక్కడో ట్విస్ట్. నిజానికి ఈ సంఘటన వెలుగులోకి రాగానే జగన్ ప్రభుత్వం స్పందించి దీనికి కారకుడైన ఎస్ ఐ ని సస్పెండ్ చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. కానీ ఈ కేసులో నిందితుల అరెస్టులు ఇంకా జరక్కపోవడం అనేది బాధితునికి మనస్తాపం కలిగించి౦ది.

ఈ నేపథ్యంలోనే బాధితుడు ఆ లేఖ రాశాడు. వివరాలలోకి వెళితే తూర్పుగోదావరిలోని రాజమండ్రి రూరల్ సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామంలో ఇసుక రేవుల నుంచి ఇసుకను తీసుకెళ్తున్న లారీలను అతివేగంగా నడుపుతున్నారని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామానికి చెందిన దళిత యువకులు కొందరు లారీలను ఆపారు. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు సంఘటన స్థలానికి వచ్చి కారుతో యువకులను ఢీ కొట్టేందుకు ప్రయత్నించగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

అయితే యువకులే దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని సీతానగరం పోలీసులకు సదరు నాయకుడు ఫిర్యాదు చేశారు.వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి వరప్రసాద్ అనే దళిత యువకుడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు.పోలీస్ స్టేషన్ లోనే ట్రైనీ ఎస్సై అతనికి శిరోముండనం చేశారు. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యుడైన ఎస్సైను సస్పెండ్‌ చేశారు. అయినా తనకు న్యాయం జరగలేదని భావించిన ప్రసాద్, రాష్ట్రపతికి లేఖ రాశాడు. శిరోమండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలా కుదరని పక్షంలో మావోయిస్టుల్లో కలిసిపోవడానికి తనకు అనుమతి ఇవ్వాలని అతడు నేరుగా రాష్ట్రపతిని కోరాడు.మేధావి వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది

author avatar
Yandamuri

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju