ఇంకో వారమే. వచ్చే ఆదివారమే బిగ్ బాస్ 4 చివరి ఎపిసోడ్. ఫైనల్ ఎపిసోడ్. ఇంకో వారంలో బిగ్ బాస్ సీజన్ 4 ముగుస్తుంది. అందుకే రోజురోజుకూ బిగ్ బాస్ షో ఆసక్తిగా మారుతోంది. నిన్న శనివారం ఎపిసోడ్ లో సోహెల్ ను సేవ్ చేశారు నాగార్జున. దీంతో అఖిల్ తర్వాత ఫైనల్స్ కు వెళ్లిన రెండో కంటెస్టెంట్ సోహెల్ అయ్యాడు. ఇంకా ముగ్గురు మాత్రమే ఫైనల్స్ కు వెళ్లగలరు. కానీ.. అక్కడ మిగిలింది నలుగురు ఇంటిసభ్యులు. అభిజీత్, అరియానా, మోనల్, హారిక. ఈ నలుగురిలో ఒకరు ఇవాళ ఎలిమినేట్ అవుతారు. మిగిలిన ముగ్గురు ఫైనల్స్ కు వెళ్తారు.

అయితే.. ఫైనల్ లో గెలిచిన విజేతకు 50 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఫైనల్స్ కు వెళ్లిన ఐదుగురిలో ఒక్కరికి మాత్రమే 50 లక్షలు దక్కుతాయి. ఒకవేళ.. ఫైనల్స్ లో మీరు గెలిస్తే.. 50 లక్షలు వస్తే ఏం చేస్తారు? అనే ప్రశ్నను నాగ్ ఇవాళ్టి వీకెండ్ ఎపిసోడ్ లో అందరు ఇంటిసభ్యులను అడిగారు.
దీంతో.. ప్రతి ఒక్కరు ఆ 50 లక్షలతో ఏం చేస్తామో ప్రేక్షకులకు తెలిపారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
అఖిల్ అయితే ఓ కాఫీ షాప్ పెడతాడట. అభిజీత్ మాత్రం ఆ డబ్బాంతా ఎవరికో ఇస్తా అని అంటున్నాడు. హారిక తన మమ్మీకే ఆ డబ్బు ఇచ్చేస్తానని చెప్పింది. ఇలా.. అందరు కంటెస్టెంట్లు ఆ డబ్బుతో ఏం చేస్తామని చెప్పారో మీరు కూడా ఈ ప్రోమోలో చూసేయండి.
Lasya: ప్రేమ మత్తులో నాన్నని మోసం చేశాను: యాంకర్ లాస్య