MAA Elections: ‘మా’ ఎన్నికల్లో గెలుపెవరిది..?

Share

MAA Elections: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ అలానే రాజకీయ వర్గాల్లో కూడా ఫోకస్ అంతా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై పడింది. మరో రెండు రోజుల్లో మా ఎన్నికలు జరగనున్నాయి. కేవలం 900 ఓట్లు అంటే గ్రామ పంచాయతీలో ఓ వార్డు స్థాయి ఎన్నిక. కానీ 900 ఓట్ల కోసమే 50 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. కొంత మంది ఖర్చు పెడుతున్నారు కూడా. గతంలో ఎప్పుడూ కూడా మా ఎన్నికలు ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగిన దాఖలాలు లేవు. పోటీ దారుల మధ్య ఇన్ని ఆరోపణలు లేవు. ఇంత పోటీ లేదు. కానీ మొదటి సారి మా ఎన్నికలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ఒకళ్ల మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తిట్టుకుంటున్నారు. బురద చల్లుకుంటున్నారు. వార్నింగ్ లు ఇచ్చుకుంటున్నారు. మా ఎన్నికలు ఇంత ప్రతిష్టాత్మకంగా మారడానికి కారణం ఏమిటి, ఎవరు గెలవబోతున్నారు. ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి. పోటీ పడుతున్న ఇరు ప్యానెల్స్ లో పాజిటివ్స్ ఏమిటి నెగిటివ్స్ ఏమిటి అనేవి పరిశీలిస్తే..

Who won the MAA Elections
Who won the MAA Elections

MAA Elections: ప్రకాశ్ రాజ్ ప్లస్, మైనస్ లు ఇవీ.

ఈ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, యువనటుడు మంచు విష్ణు ప్యానెల్స్ పోటీ పడుతుండగా, తెరవెనుక మోహన్ బాబు, చిరంజీవి ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అలానే కమ్మ, కాపు అని కూడా చెప్పుకోవచ్చు. సామాజిక అంశాన్ని పక్కన బెడితే..మంచు విష్ణు తండ్రి సీనియర్ నటుడు మోహన్ బాబు నేరుగానే ఇన్వాల్వ్ అయి ఎన్నికల్లో ఆయన కుమారుడిని గెలుపించుకోవడానికి తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రకాశ్ రాజ్ కు మెగా క్యాంప్ నుండి సపోర్టు ఉంది. నాగబాబు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు తప్ప చిరంజీవి నేరుగా ఇన్వాల్వ్ కాలేదు. కానీ మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అనే చెప్పుకోవాలి. మెగా కుటుంబ అనుబంధమే ప్రకాశ్ రాజ్ బలం. మెగాస్టార్ చరిష్మా, కాపు సామాజిక వర్గ సినీ పెద్దల సహకారమే ప్రకాశ్ రాజ్ ప్రధానమైన బలం. అయితే ప్రకాశ్ రాజ్ కు బలహీనతలు చాలానే ఉన్నాయి. ఆయనకు గర్వం, అహంభావం ఎక్కువ అని అంటుంటారు. అలానే క్రమశిక్షణ లేదనీ, తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా పరిచయాలు లేకపోవడంతో పాటు ఎక్కువ మందితో గొడవలు ఉంటాయనీ, షూటింగ్ సమయంలోనూ డైరెక్టర్లు, సహచర నటులతోనూ ఆయనకు సరిగా పడేది కాదు అనే ముద్ర ఉంది. ఇన్నాళ్లూ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. సహచరులతో ఫోటోలు దిగింది లేదు. కానీ ఇప్పుడు తెలుగు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఫోటోలు దిగుతున్నారు. మా ఎన్నికల కోసమే ఇప్పుడు ఇలా ఉంటున్నారని అంటున్నారు. దానితో పాటు నాన్ లోకల్ అనే ముద్ర ఉంది. ఇవన్నీ ప్రకాశ్ రాజ్ కు నెగిటివ్ కాబోతున్నాయి. ఏకైక పొజిటివ్ అంశం ఏమిటంటే చిరంజీవీి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ల మద్దతు ఇవ్వడం. మెగా కుటుంబంలో దాదాపు పది మంది హీరోలు ఉన్నారు. వారందరి మద్దతు వారి అనుబంధ సభ్యుల మద్దతు, వారికి అనుకూలమైన నిర్మాతలు, సభ్యుల మద్దతు ప్రకాశ్ రాజ్ కు ఉంది.

మంచు విష్ణు పాజిటివ్, నెగిటివ్స్ ఇవీ

ఇక మంచు విష్ణు విషయానికి వస్తే…అతనికీ పాజిటివ్స్, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏమిటంటే మోహన్ బాబు కుటుంబానికి ఉన్న పరిచయాలు. మోహన్ బాబు అందరికీ ఫోన్ లు చేసి తన కుమారుడికి ఓటు వేయాలని కోరుతున్నారు. చిరంజీవి నేరుగా ప్రకాశ్ రాజ్ కోసం ఎవరికీ ఫోన్ లు చేసి చెప్పడం లేదు. ఇది ఒక్కటే మంచు విష్ణుకు ప్లస్ పాయింట్. విష్ణుకు కూడా అనేక నెగిటివ్స్ ఉన్నాయి. విష్ణు కుటుంబం భారీ బిల్డప్ లు ఇస్తుంటారనేది మైనస్. అయితే ప్రకాశ్ రాజ్ కు ఉన్న మైనస్ లను పోలిస్తే మంచు విష్ణుకు ఉన్న మైనస్ లు పెద్ద లెక్కలోనివి కావని అంటుంటారు. సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన కమ్మ సామాజికవర్గ బలం విష్ణుకు ఉంది. వీటికి తోటు మంచు విష్ణుకు అధికార వైసీపీ సపోర్టు పరోక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో విష్ణుకు గెలుపు అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా మెగా క్యాంప్ కాస్త సీరియస్ గా తీసుకుంటే ఎన్నికల వ్యూహాలు బలంగా వీస్తే ప్రకాశ్ రాజ్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


Share

Related posts

ఒకసారిగా అంతమంది టీడీపీ నేతలు హైదరబాద్ ఎందుకు పరిగెత్తారు?

CMR

Rajini Kanth: తమిళ పొలిటికల్ పార్టీలన్నిటికీ ఊహించని షాక్ ఇస్తూ రజినీ సెన్సేషనల్ డెసిషన్..!!

sekhar

BREAKING: గాంధీ జయంతి రోజున శ్రమదానం చేయనున్న జనసేన పార్టీ..!

amrutha