శర్వానంద్ కెరీర్ ఇలా యూటర్న్ తీసుకుంటుందని ఎవరు ఊహించలేదు ..?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కి సాలీడ్ హిట్ పడి చాలాకాలం అవుతోంది. చెప్పాలంటే ‘శతమానంభవతి’ లాంటి మంచి హిట్ మళ్ళీ దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన ‘మహానుభావుడు’ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికి భారీ కమర్షియల్ హిట్ అన్న మాట మాత్రం వినిపించలేదు. ఇక ఈ సినిమా తర్వాత శర్వానంద్ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది.

Jaanu Teaser - Sharwanand, Samantha | Premkumar | Dil Raju - YouTube

శర్వానంద్ కి ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఉంది. కాని వాళ్ళనే మెప్పించలేని సినిమాలు చేశాడు. ‘పడి పడి లేచే మనసు, రణరంగం, జాను’ సినిమాలు ఎంతో నమ్మకం పెట్టుకొని చేశాడు. కాని ఈ మూడు సినిమాలలో ఏ ఒక్కటి ఆశించిన విధంగా సక్సస్ ని ఇవ్వలేదు. దాంతో శర్వానంద్ మళ్ళీ తనకి బాగా కలిసొచ్చే కుటుంబ కథా చిత్రాలు, యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ ని చేయాలని డిసైడయ్యాడు.

Buyers hesitate to invest in Sharwanand Sreekaram - tollywood

ఈ క్రమంలోనే ‘శ్రీకారం’ అన్న సినిమా చేస్తున్నాడు. కిషోర్ బి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ‘శతమానంభవతి’ తరహాలోనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా తయారవుతుందని సమాచారం. ఇక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కించనున్న ‘మహాసముద్రం’ సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాల తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో నటించనున్నాడు. దసరా సందర్భంగా ఈ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మొత్తానికి జాను ఫ్లాప్ తర్వాత శర్వానంద్ కెరీర్ ఏంటి..? అనుకున్న అందరికి ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కమిటై షాకిచ్చాడు. చెప్పాలంటే ఈ హీరో కెరీర్ ఇలా యూటర్న్ తీసుకొని ట్రాక్ ఎక్కుతుందని ఎవరూ ఊహిచలేదు.