Anushka shetty : అనుష్క శెట్టి అంటే ప్రయోగాలు చేయడంలో ముందు ఉండే సౌత్ హీరోయిన్ అని పేరు. అందుకే ఆమె నుంచి అరుంధతి సినిమా వచ్చింది. ఈ సినిమా తన రేంజ్ అండ్ క్రేజ్ ని పూర్తిగా మార్చేసింది. అంతవరకు కంప్లీట్ గ్లామర్ పాత్రలు పోషించింది అనుష్క. సూపర్ సినిమా తన కెరీర్ లో మెదటి సినిమా. నాగార్జున హీరో..సోనూసూద్ కీలక పాత్ర పోషించాడు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత అనుష్క ఇక సినిమాల పరంగా..అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు.
పంచాక్షరి అనే సినిమాలో డ్యూయల్ రోల్ పోషించింది. కానీ ఈ సినిమా అరుంధతి రేంజ్ లో సక్సెస్ ఇవ్వలేదు. అయినా అనుష్క ప్రయోగాలు చేస్తూనే ఉంది. కోలీవుడ్ లో సూపర్ హిట్స్ అందుకుంది. సూర్య హీరోగా పోలీస్ పాత్రతో తమిళ దర్శకుడు హరి తెరకెక్కించిన సింగం సిరీస్ లో అనుష్క నటించి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. కానీ తమిళంలో కూడా అవకాశాలు తగ్గాయి. బాహుబలి పార్ట్ వన్ తర్వాత సైజ్ జీరో అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా అనుష్క కి కోరుకున్న హిట్ ఇవ్వలేదు.
Anushka shetty : మళ్ళీ ప్రయోగమే అని టాక్ వినిపిస్తోంది.
విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కూడా అనుష్క కెరీర్ కి సైజ్ జీరో అనే సినిమా మైనస్ గానే మిగిలింది. ఆ ప్రభావం ఈమె సినీ కెరీర్ మీద గట్టిగానే పడింది. ఇదంతా పట్టించుకోకుండా నిశ్శబ్ధం అనే పాన్ ఇండియన్ సినిమాతో మళ్ళీ కొత్త ప్రయోగం చేసింది. ఈ సినిమాతో అనుష్కకి ఉపయోగపడిందేది లేదు. అందుకే ఇప్పుడు ప్రయోగాలు అంటే అంత దూరం ఉంటుందట. కమర్షియల్ సినిమాలు కూడా చేసేందుకు ఛాన్స్ దక్కడం లేదు. అయితే యూవీ నిర్మాణంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మళ్ళీ ప్రయోగమే అని టాక్ వినిపిస్తోంది. ఈసారి ఈ ప్రయోగం వర్కౌట్ అవుతుందో లేదో.