డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలామంది ఇండస్ట్రీకొచ్చిన హీరో, హీరోయిన్స్.. కొంతమంది నటీ, నటులు చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కాని ఈ హీరో మాత్రం డైరెక్టర్ కాబోయి హీరో అయ్యాడు. గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసోసియేట్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసిన ఒక సాధారణమైన వ్యక్తి టాలీవుడ్ లో ఇంతటి క్రేజ్ సంపాదించుకుంటాడని ఏ ఒక్కరు అంచనా వేయలేదు.
తనలో ఒక గొప్ప నటుడున్నాడన్న విషయం పసిగట్టిన ఒక టాలెంటెడ్ డైరెకర్ అతన్ని హీరో చేశాడు. మెగాస్టార్ చిరంజీవి.. మాస్ మహారాజ రవితేజ.. స్వయంకృషితో అంచలంచెలుగా ఎదిగి ఇండట్రీలో స్టార్ హోదాని సాధించారు. ఆ ఇద్దరి తర్వాత మళ్ళీ ఈ హీరో గురుంచే ప్రేక్షకులు.. ఇండస్ట్రీ వర్గాలు గొప్పగా చెప్పుకుంటారు. హీరో మెటీరియల్ అని నమ్మి మొదటి అవకాశం ఇచ్చిన దర్శకుడే ఆ హీరో 25 వ సినిమాని తెరకెక్కించడం విశేషం. ఆ హీరోనే నేచురల్ స్టార్ నాని. నాని లో హీరో ని చూసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.
రీసెంట్ గా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వి సినిమా వచ్చింది. రిజల్ట్ విషయం ఎలా ఉన్న ఎప్పటిలాగే నాని కి పర్ఫార్మెన్స్ పరంగా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాని కి జంటగా నటించిన అదితిరావ్ హైదరీ నాని నటనను తెగ పొగిడేసింది. ఇంతకముందు నాని ఇంద్రగంటి కాంబినేషన్ లో వచ్చిన జెంటిల్ మాన్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన నివేదా థామస్ నాని ఇలాగే ఆకాశానికి ఎత్తేసింది. ఇప్పుడు అదితి అదే రేంజ్ లో నాని ని మేసేస్తుంది. అంతేకాదు ఈ ఇద్దరు నాని సినిమాలో ఎప్పుడు ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకోమని ఖచ్చితంగా చెబుతున్నారు. మొతానికి నాని హీరోయిన్స్ కూడా ఫ్యాన్స్ ఉండటం గొప్ప విషయమే.