పూజావేళల్లో పుష్పాలు ఎందుకు వినియోగిస్తారు..?

Share

హిందు మతంలో పూజలు అనేవి నిత్యం చేస్తారు. వీటిలో అనేక ఆచారాలు. ఏదేవుడికి పూజ చేసినా సరే వారికి ఆయా రకాల పుష్పాలను సమర్పించడం సాధారణం.

Why are flowers used during worship
Why are flowers used during worship

అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి తెలిసి వుండదు. భక్తి పూర్వకంగా, పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్నిగాని, పండును గాని, జలాన్ని గాని సమర్పిస్తారో అలాంటివారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ భగవానుడు ‘గీత’లో చెప్పాడు. ఎవరైతే దైవాన్ని పరిశుద్ధమైన, నిష్కపటమైన మనస్సుతో పూజించి తరిస్తారో అలాంటి వారిని ఆ దైవం వెన్నంటే ఉండి కాపాడుతుంది. సాక్షాత్తు శ్రీక్రిష్ణభగవానుడే తన అర్చనా విధానంలో పుష్పాలను చేర్చాడంటే.. భగవదారాధనలో పుష్పాల పాత్ర ఎంత అమోఘమైందో అర్థం చేసుకోవచ్చు.

అందువల్ల పూజా విధానంలో పుష్పాలు తప్పనిసరి. భూమిపై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను పూజకు వినియోగించరాదని శాస్త్రం చెబుతోంది. శుచిగా, స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర, పుష్పాలనే దైవ పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలి. వాడిపోయినవి, ముళ్ళుతో కూడుకున్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమయిన పుష్పాల వినియోగం శ్రేయస్కరం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. తామర పువ్వులు, కలువ పువ్వులు, జాజులు, చామంతి, నందివర్ధనములు, మందారము, నీలాంబరాలు, కనకాంబరాలు, మాలతి, పారిజాతాలు, పద్మాలు, మంకెన, మునిగోరింట, ఎర్రగన్నేరు, గరుడవర్ధనము, నిత్యమల్లి పుష్పాలు పూజలకు పవిత్రమైనవిగా చెబుతారు.

సూర్యభగవానుడ్ని, విఘ్నేశ్వరుని తెల్లజిల్లేడు పుష్పాలతో పూజించాలి. విష్ణుని తులసి దళాలతో, శ్రీమహాలక్ష్మిని తామర పువ్వులతో, గాయత్రిదేవిని ‘మల్లిక’, ‘పొగడ’, ‘కుశమంజరి’, ‘మందార’, ‘మాధవి’, జిల్లేడు, ‘కదంబ’, ‘పున్నాగ’, ‘చంపక’, గరిక పుష్పాలతో పూజించాలి. అలాగే ‘శ్రీచక్రాన్ని’ తామరపువ్వులు, తులసి దళాలు, కలవ పూలు, జాజి, మల్లె, ఎర్రగన్నేరు, ఎర్ర కలువపూలు, గురువింద పుష్పాలతో పూజించాలి. ఇలా ఆయా దేవతలు ఆయా రకాల పుష్పాలతో పూజిస్తే  తప్పక అనుకూల ఫలితాలు వస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.


Share

Related posts

అబ్బబ్బ ఒకే ఒక్క ఐడియాతో టాప్ లీడర్స్ అందరిచెత శభాష్ అనిపించుకున్న జగన్!

CMR

Sayyeshaa Latest Images

Gallery Desk

ఇళ్ల పట్టాల పంపిణీ పై అధికారులతో సిఎం జగన్ రివ్యూ

Siva Prasad