Bank: సాధారణంగా చాలామంది డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటారు. సేవింగ్స్ అకౌంట్ రూపంలో డిపాజిట్ల రూపంలో చాలామంది వివిధ బ్యాంకుల్లో పొదుపు చేస్తుంటారు. అయితే డిపాజిట్లు సేకరించే బ్యాంకు దివాలా తీస్తే.. పరిస్థితి ఏంటనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? బ్యాంకు ఉన్నట్టుండి మూతపడితే మీరు పొదుపు చేసిన డబ్బులు నష్టపోయినా..భారత్ బ్యాంకుల దివాలా తీస్తే..డిపాజిట్లకు పరిహారం చెల్లించే సదుపాయం ఉందా?అనే విషయాలను తెలుసుకుందాం..

బ్యాంకు దివాలా తీసిన సందర్భంలో ఖాతాదారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం భీమా సౌకర్యం కల్పిస్తోంది. బ్యాంకులు దివాలా తీసిన సందర్భాల్లో అకౌంట్ హోల్డర్లు నష్టపోకుండా ఉండడానికి రిజర్వు బ్యాంకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తుంది. సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్,రికరింగ్ డిపాజిట్, ఫిక్స్ డ్ డిపాజిట్,పర్మినెంట్ డిపాజిట్ ఇలా తదితర రూపాల్లో బ్యాంకుల్లో పొదుపు చేసిన వారికి ఇన్సూరెన్స్ అమలవుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ క్లారిటీ కార్పొరేషన్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్
కల్పిస్తుంది.గుర్తింపు పొందిన అన్ని బ్యాంకులు అకౌంట్ హోల్డర్లు భీమా సదుపాయాన్ని
వినియోగించుకోవచ్చు .ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న వాటిపై ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ ప్లెయిన్ చేసుకునే వీలు ఉండదు.
వీటికి ఇన్సూరెన్స్ ఉండదు:
ఇతర దేశాల ప్రభుత్వాలు చేసే డిపాజిట్లపై డిఐసిజిసి ఇన్సూరెన్స్ కల్పించట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లకు ఈ బీమా ఉండదు.ఇంటర్ బ్యాంక్ రెండిటిఎన్ఎస్ క్రెడిట్ అయిన సందర్భాల్లో వర్తించదు. రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకుతో జరిపే స్టేట్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ డిపాజిట్లు కూడా ఈ ఇన్సూరెన్స్ పరిధిలోకి రావు.. విదేశాల్లో చేసిన చెల్లింపులు మొత్తం పై కూడా ఇన్సూరెన్స్ ని అమలు చేయట్లేదు. బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిన మొత్తం పై ఆయా సంస్థలు ఇచ్చే మినహాయింపులకు కూడా ఇన్సూరెన్స్ వర్తించదు.