Bollywood-Tollywood : బాలీవుడ్‌లో సంజయ్ దత్, సల్మాన్ చేస్తున్నటువంటి సినిమాలు ఇక్కడ మెగాస్టార్, బాలయ్య లాంటివారు ఎందుకు చేయలేకపోతున్నారు..

Share

Bollywood-Tollywood : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, లాంటి సీనియర్ స్టార్ చేస్తున్న సినిమాలు మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారనే వార్తలు ఇక్కడ మెగాస్టార్, బాలయ్య లాంటివారు ఎందుకు చేయలేకపోతున్నారు.. అనే టాక్ గత కొంతకాలంగా ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు ఒక వర్గం ఇండస్ట్రీ వారిలోనూ వినిపిస్తోంది. అందుకు కారణం మన టాలీవుడ్ సీనియర్ హీరోలు ఇంకా 60 ఏళ్ళు వయసు పైబడినా కూడా హీరోలుగా నటించాలనుకోవడమే. అంత ఏజ్ వచ్చినా కూడా కుర్ర భామలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుండటమే.

why-cant-tollywood-heroes-are-able to-do-movies-like-bollywood-heroes
why-cant-tollywood-heroes-are-able to-do-movies-like-bollywood-heroes

అప్పటికి కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇంకా మీరు హీరోగా ఎంతకాలం సినిమాలు కంటిన్యూ చేస్తారు అని. అంతేకాదు బాలయ్య లాంటి సీనియర్ హీరో పక్క నటించడానికి అంత త్వరగా క్రేజ్ ఉన్న యంగ్ హీరోయిన్స్ ఎవరూ ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న అఖండ సినిమాలో హీరోయిన్ పాత్రకు ముందు కీర్తి సురేశ్ అనుకున్నారు. ఆమె నో చెప్పారు. అప్పటి నుంచి సాయేషా సైగల్, నయతార, కొత్త మోడల్స్, ప్రయాగా మార్టీన్ లాంటి పరభాషా హీరోయిన్స్ సహా చాలా మందిని ట్రై చేశారు. కానీ ఎవరూ సెట్ కాలేదు. చివరికి కంచె భామ ప్రగ్యా జైస్వాల్ ఒప్పుకుంది.

Bollywood-Tollywood : మనవాళ్ళు బాలీవుడ్ లో వస్తున్న కొన్ని మంచి సినిమాలను ఎందుకు చేయరు.

ఇంతక ముందు కూడా బాలయ్య సినిమాలో హీరోయిన్స్ సెట్ కావడం లేదంటూ వార్తలు వచ్చాయి. అయితే మనవాళ్ళు బాలీవుడ్ లో వస్తున్న కొన్ని మంచి సినిమాలను ఎందుకు చేయరు.. అంటే ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదు. అందుకే హిందీలో వచ్చినటువంటి గొప్ప సినిమాలు కొన్ని మన టాలీవుడ్‌లో రావడం లేదు. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో యంగ్ హీరోయిన్ అదితి రావు హైదరీ ఆయనకి కూతురుగా నటించిన సినిమా భూమి. ఈ సినిమా తండ్రి కూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఇలాంటి సినిమా తెలుగులో చిరంజీవి గానీ, బాలకృష్ణ గానీ చేస్తే ఇక్కడ ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో.

అంతేకాదు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ లాంటి సినిమా ఇక్కడ చేసే సాహసం ఏ సీనియర్ హీరో చేస్తాడు. సల్మాన్ ఖాన్ కూడా భజరంగీ భాయ్ జాన్ అనే సినిమా చేశాడు. ఇది మన మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాకి ఆధారంగా బాహుబలి రచయిత రాసిన కథ. కానీ ఇక్కడి కంటే హిందీలో గొప్ప సక్సెస్ సాధించింది. కారణం కథా నేపథ్యం. అక్షయ్ కుమార్ కూడా సామాజిక అంశాలతో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు.

Bollywood-Tollywood : అలాంటి సినిమాలను మనవాళ్ళు ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నారు.

ప్యాడ్ మాన్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ లాంటి సినిమాలు హిందీలో చాలా బాగా ప్రేక్షకాధరణ పొందాయి. ఇలాంటి సినిమాలు చేయాలంటే మన వాళ్ళకి ఇమేజ్ దెబ్బతింటుందనే భయం ఉంటుంది. కానీ వారు ఎలాంటి భయాలు లేకుండా కథ నచ్చితే సినిమా చేయడానికి ఏమాత్రం ఆలోచించరు. షారుఖ్ ఖాన్ చక్ దే ఇండియా అనే సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. అలాంటి సినిమాలను మనవాళ్ళు ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నారు. వీరిలో ముందు ఉంటున్న హీరో వెంకటేశ్. అందుకే ఆయన గురు సినిమా చేసి హిట్ అందుకున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కాస్త ఇమేజ్‌కి దూరంగా వచ్చి సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేసిందే వకీల్ సాబ్. ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ నుంచి మాత్రమే కాదు మిగతా హీరోల నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు.


Share

Related posts

రెండేళ్ల క్యాలెండర్ ని ఫిల్ చేసిన రెబల్ స్టార్

Kranthi Aman

Lavanya Tripathi Latest wallpapers

Gallery Desk

Finger Nails: మీ చేతికి ఉన్న గోర్లు బట్టే మీ ఆరోగ్యం తెలిసిపోతుంది! అది ఎలా అంటారా?

Naina