NewsOrbit
న్యూస్ సినిమా

Swathi: కలర్స్ స్వాతి హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉన్న సమయంలో సినిమాల నుంచి అందుకే తప్పుకుందా..?

Swathi కలర్స్ అనే బుల్లితెర పాపులర్ షోతో ముద్దు ముద్దు మాటలతో అతి చిన్న వయసులోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది స్వాతి. ఆ ప్రోగ్రాంతోనే తనకి కలర్స్ స్వాతీ అనే పేరు స్థిరపడింది. హీరోయిన్ అయ్యాక కూడా ఆమెను అందరూ కలర్స్ స్వాతీగానే పిలిచారంటే కలర్ ప్రోగ్రాం ఆమెకి ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. అలా బుల్లితెర షోతో పాటు కొన్ని సినిమా ఈవెంట్స్‌కి హోస్ట్‌గానూ, సింగర్‌గానూ వ్యవహరించిన స్వాతీ యంగ్ హీరోయిన్స్‌కి గాత్రదానం కూడా చేసింది. ఇలా యాంకర్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న స్వాతి ఆ తర్వాత టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మారింది.

why colours swathi fade out from industry
why colours swathi fade out from industry

యంగ్ హీరోల సరసన పర్‌ఫెక్ట్ హీరోయిన్ స్వాతి అని పేరు తెచ్చుకుంది. ఎటూ యాంకర్‌గా బాగా పాపులర్ కాబట్టి సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటడానికి పెద్దగా కష్టపడలేదు. అవకాశాలు కూడా స్వాతికి బాగా వచ్చాయి. కేవలం అవకాశాలు మాత్రమే కాదు.. మంచి సక్సెస్‌లు కూడా స్వాతి ఖాతాలో చేరాయి. చెప్పాలంటే ఒకదశలో స్వాతీ టాలీవుడ్ యూత్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్‌గా మారుతుందని అందరూ భావించారు. స్టార్ స్టేటస్ కూడా దక్కించుకుంటుందని చెప్పుకున్నారు. అంతగా సినిమాలలో స్వాతి పోషించిన పాత్రలకి పేరొచ్చింది.

Swathi: డేంజర్ మూవీతో స్వాతి నటిగా మారింది.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ మూవీతో స్వాతి నటిగా మారింది. ఈ సినిమాలోని తన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా నటించిన అష్టా చెమ్మా సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. అంతేకాదు ఈ సినిమాతో నంది అవార్డ్ కూడా దక్కించుకుంది. అష్టా చెమ్మా తర్వాత స్వాతికి మంచి క్రేజ్ రావడంతో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ, మలయాళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది.

ఆడవారి మాటలకి అర్థాలే వేరులే సినిమాలో స్వాతి పాత్రకి మంచి పేరిచ్చింది. ఇక త్రిపుర లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా స్వాతి నటించింది. ముఖ్యంగా యంగ్ హీరో నిఖిల్ నటించిన స్వామీ రారా, కార్తికేయ సినిమాలతో హీరోయిన్‌గా బాగా పాపులారిటీ దక్కించుకుంది స్వాతి. ఈ సినిమాల తర్వాత ఆమె సినిమాల మీద అంతగా ఆసక్తి చూపించలేదనే టాక్ వినిపించింది. 2017లో వచ్చిన లండన్ బాబులు సినిమా తర్వాత మళ్ళీ హీరోయిన్‌గా స్వాతి కనిపించలేదు. అందుకు కారణం ఆమె పర్సనల్ లైఫ్ మీద దృష్ఠి పెట్టడమే. అందరూ స్వాతికి అవకాశాలు లేక కనుమరుగపోయిందనుకున్నారు.

Swathi: స్వాతి వ్యక్తిగత జీవితానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది.

కానీ ఆమె ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఏ ఏజ్‌లో జరగాల్సినవి ఆ ఏజ్‌లోనే జరగాలని .. అందుకే సినిమా అవకాశాలు వస్తున్నా కుడా వాటిని కాదని స్వాతి వ్యక్తిగత జీవితానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. వికాస్ వాసు అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్న స్వాతి కొంతకాలం ఫారిన్‌లో ఉండిపోయింది. అయితే మళ్ళీ ఇప్పుడు సినిమాలలో రీ ఎంట్రీ ఇస్తోంది. పంచతంత్రం అనే సినిమాలో మళ్ళీ అవకాశం అందుకొని మొహానికి మేకప్ వేసుకుంది. అయితే నిఖిల్ చందు మొండేటిల కాంబినేషన్‌లో రూపొందుతున్న కార్తికేయ 2 లో స్వాతి నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే.

Related posts

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri