సాధారణంగా మనం ఏదైనా అనారోగ్య సమస్యతో హాస్పిటల్ కి వెళితే వెంటనే వైద్యుడు నాలుక చూపించమని అడుగుతారు. నాలుక లోపల ఒక లైట్ వేసి పరీక్షగా చూస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క మృదువుగా ఉంటుందట.
నాలుక లేత గులాబీ రంగులో ఉంటే?
ఒక వ్యక్తి యొక్క నాలుక లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటే ఆ వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉన్నాడని అర్ధమట.
నాలుక ఉదా రంగులో ఉంటే?
నాలుక ఊదా రంగులో ఉంటే ఆ వ్యక్తికి రక్తప్రసరణ సమస్యలు ఉన్నాయని అర్థమట. అలాగే నాలుక పాలిపోయినట్లుగా అనిపిస్తే రక్తహీనత ఉన్నదని భావిస్తారట. డాక్టర్లు ముందుగా నాలుక చూసాక దానిబట్టి పోషకాలు ఉన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తారట. అలాగే
నాలుక ఎర్రరంగులో ఉంటే?
శరీరంలో విటమిన్ బి లోపం ఉంటే నాలుక ఎర్ర రంగులో ఉంటుంది. అంతేకాకుండా జ్వరం వచ్చినప్పుడు కూడా నాలుక ఎరుపురంగులో మారుతుందట. యాంటీ బయాటిక్ మందులను ఎక్కువగా తీసుకున్నప్పుడు నాలుక నల్లగా మారిపోతుందట మరియు నాలుక మీద తరచూ పుండ్లు కూడా వస్తుంటే శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని దాని అర్థమట. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలట.
ఎక్కువ కాలం మీరు నాలుకకు సంబంధించి సమస్యలు ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి. నోటిలో ఉండే బాక్టీరియా వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయట. కాబట్టి ప్రతిరోజు బ్రష్ చేసిన తరువాత తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి.