NewsOrbit
న్యూస్

మహారాష్ట్రలో జపనీస్ భాష ఎందుకు నేర్పిస్తున్నారబ్బా..??

ప్రభుత్వ పాఠశాలలో ఏ బాషలో విద్యా బోధన చేయాలన్న అంశంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. మాతృభాషలో బోధించాలని కొందరు, ఆంగ్లంలో అయితే ఉద్యోగరీత్యా భవిష్యత్తు బాగుంటుందని కొందరు అంటున్నారు. భాషపై ఇన్ని వివాదాలు జరుగుతుండగా మహారాష్ట్ర లోని ఓ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఏకంగా జపనీస్ విదేశీ భాషను నేర్చుకుంటున్నారు.

 

ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల ఎంపిక కోసం, అంతర్జాతీయ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం విదేశీ భాషను నేర్పిస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి సదుపాయం లేదు. అయితే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాడివాట్ అనే గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల లోని విద్యార్థులకు అక్కడి పాఠశాల యాజమాన్యం జపనీస్ భాష నేర్పిస్తుంది. ఆ స్కూల్ యాజమాన్యం ౪- 8 విద్యార్థులను ఏదైనా విదేశీ భాషను ఎంచుకోండి అంటే వారందరూ జపనీస్ ఎంచుకున్నారు.

ఔరంగాబాద్ లో ఉన్న అజంతా ఎల్లోరా గుహలను చూడడానికి ఏటా చాలామంది జపనీయులు వస్తూ ఉంటారు. వారికి వారి మాతృభాషలో ఈ చారిత్రక నిర్మాణాల గురించి వివరించేందుకు ఉపయోగపడుతుంది. విద్యార్థులు జపనీస్ నేర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. దీంతో జపనీస్ భాష పండితులతో ఆన్లైన్ తరగతులు ద్వారా విద్యార్థులకు ఈ భాష నేర్పిస్తున్నారు. అక్కడి టీచర్లు కూడా ఈ జపనీస్ నేర్చుకోవడం విశేషం. అయితే ఈ పాఠశాల విద్యార్థులు నేర్చుకోవడం గురించి తెలిసి జపాన్ లో ఉంటున్న ఓ భారతీయ ప్రొఫెసర్ ఈ పాఠశాలలకు మరాఠీ- జపనీస్ డిక్షనరీ లను పంపించారు.విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా ఈ పాఠశాల ఇతర పాఠశాలలకు మార్గదాయకం.

విద్యార్థులకు విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రతి ఏడాది ఈ విదేశీ భాషా కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్థానిక జిల్లా విద్యాధికారి తెలిపారు. విద్యార్థులు జపనీస్ నేర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జపనీయులు ఔరంగాబాద్ లో ఉన్న అజంతా ఎల్లోరా గుహలను చూడడానికి వస్తూ ఉంటారు. వారికి గైడ్గా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు ఇక్కడి విద్యార్థులు టెక్నాలజీ, రోబోటిక్స్ పై ఆసక్తి చూపుతున్నారు. జపాన్లో ఈ రంగాలకు అధిక ప్రాధాన్యం ఉంది . దీంతో జపనీస్ భాష నేర్చుకుని అక్కడికి వెళ్లి ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేస్తామని విద్యార్థులు అంటున్నారు. ఇప్పటికే జపనీస్ నేర్చుకోవడంలో తొలి దశ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆ భాషలో మాట్లాడగలుగుతున్నారు. ప్రస్తుత సమయంలో విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరు అవుతున్నారు. ఈ పాఠశాల ఇతర పాఠశాలలకు మార్గదర్శకం అనడంలో సందేహం లేదు.

author avatar
bharani jella

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju