కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య సినిమాలో చిరంజీవి కి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ జరిగిన ఈ సినిమా త్వరలో మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళబోతుంది.
ఇక ఈ సినిమా తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఇండియన్ 2 లో కమల్ హాసన్ కి జంటగా నటిస్తోంది. శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు భారీ సినిమాలతో పాటు యంగ్ హీరో హీరో మంచు విష్ణు నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. మోసగాళ్ళు అన్న టైటిల్ తో ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.
అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ విష్ణు కి సోదరి గా కనిపించబోతుందని సమాచారం. ఇదే నిజమైతే కాజల్ పెద్ద ప్రయోగమే చేస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు కాజల్ హీరోకి చెల్లిగా నటించక పోవడంతో మోసగాళ్ళు సినిమాలో కాజల్ చేస్తున్న పాత్ర మీద ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోను ఆసక్తి నెలకొంది. అంతేకాదు కాజల్ ఇలాంటి పాత్ర ఎందుకు ఒప్పుకుందో అన్న చర్చలు బాగా జరుగుతున్నాయట.
ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో మంచి ఫాం లో ఉంది. వరసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. దాదాపు ఇండస్ట్రీకొచ్చి 13 సంవత్సరాలు అవుతున్నప్పటికి కాజల్ అగర్వాల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. యంగ్ హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్ లాంటి సీనియర్ స్టార్ హీరోల తోను నటిస్తుంది. అంతేకాదు వెబ్ సిరీస్ లో నటించడానికి రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కాజల్ అగర్వాల్.