Bigg boss 4: స్టార్ మా చానెల్ విషయంలో నాగార్జున ఎందుకు అబద్ధం చెప్పినట్టు?

మీరు గత ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ చూశారా? అందులో.. హోస్ట్ నాగార్జున ఒక విషయం చెప్పారు గుర్తుందా? స్టార్ మా తెలుగు దేశంలోనే నెంబర్ వన్ జీఈసీ చానెల్ అన్నారు. జీఈసీ అంటే.. జనరల్ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ అన్నమాట. న్యూస్ చానెళ్లు, ఇతరత్రా లోకల్ చానెళ్లు, అడ్వర్ టైజ్ మెంట్ చానెళ్లు కాకుండా.. కేవలం ఎంటర్ టైన్ మెంట్ కేటగిరీలో స్టార్ మా తెలుగు దేశంలోనే నెంబర్ వన్ చానెల్ అని నాగార్జున చెప్పారు. కానీ.. అది ఏ వారానికో చెప్పలేదు.

Why nagarjuna lied on star maa position?
Why nagarjuna lied on star maa position?

అయితే.. టీవీ చానెళ్లకు రేటింగ్స్ ఇచ్చే బార్క్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే మాత్రం.. 40వ వారానికి అంటే.. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 9 వరకు అందులో డేటా ఉంది. ఆ డేటా ప్రకారం చూసినా.. స్టార్ మా నెంబర్ వన్ పొజిషన్ లో అయితే లేదు. కానీ టాప్ 5లో ఉంది. మొదటి పొజిషన్ లో స్టార్ ఉత్సవ్ చానెల్ ఉంది. అయితే.. ఈ స్టార్ ఉత్సవ్ చానెల్ కూడా స్టార్ గ్రూప్ నకు చెందిన చానెలే కానీ.. స్టార్ మా మాత్రం నెంబర్ వన్ పొజిషన్ లో లేదు.

Why nagarjuna lied on star maa position?
Why nagarjuna lied on star maa position?

స్టార్ ఉత్సవ్ కు 14 లక్షల ఇంప్రెషన్స్ రాగా… స్టార్ మా కు 8 లక్షల ఇంప్రెషన్స్ మాత్రమే వచ్చాయి. అయితే.. ఏపీ, తెలంగాణలో మాత్రం జీఈసీలో స్టార్ మా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. తెలుగు ఎంటర్ టైన్ మెంట్ జోన్ లో స్టార్ మా 8 లక్షల ఇంప్రెషన్లతో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండగా… జీ తెలుగు 5 లక్షల ఇంప్రెషన్లతో నెంబర్ 2 పొజిషన్ లో ఉంది. ఆ తర్వాత ఈటీవీ తెలుగు, జెమినీ టీవీ, స్టార్ మా మూవీస్ ఉన్నాయి.

Why nagarjuna lied on star maa position?
Why nagarjuna lied on star maa position?

ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఉంది. స్టార్ మా నెంబర్ వన్ గా తెలుగులో ఉంది కానీ.. బిగ్ బాస్ మాత్రం టాప్ 5 ప్రోగ్రామ్స్ లో ఎక్కడా లేదు. స్టార్ మాలోనే టాప్ 5 ప్రోగ్రామ్స్ లో అన్నీ సీరియళ్లే రాజ్యమేలుతున్నాయి. 15 వేల ఇంప్రెషన్స్ తో కార్తీక దీపం సీరియల్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉండగా… ఆ తర్వాత ఇంటింటి గృహలక్ష్మీ, వదినమ్మ, దేవత, చెల్లెలి కాపురం సీరియళ్లు ఉన్నాయి.

Why nagarjuna lied on star maa position?
Why nagarjuna lied on star maa position?

అసలు.. టాప్ ప్రోగ్రామ్స్ లో బిగ్ బాస్ లేదు. దేశంలోనే నెంబర్ వన్ జీఈసీ చానెల్ గా స్టార్ మా లేదు. అయినా కూడా నాగార్జున బిగ్ బాస్ స్టేజీ మీద ఈ విషయం ఎందుకు చెప్పినట్టు.. అనే ప్రశ్న ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో మెదులుతోంది.