నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘వి’. సుధీర్ బాబు మరో హీరోగా.. నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాని దిల్రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ అన్న డిఫ్రెంట్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి నటించబోతున్నట్లు తాజా సమాచారం. నెగటివ్ రోల్ లో అదితి కనిపించబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే అదితి ..నాని నటించిన వి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ‘శ్యామ్ సింగ రాయ్’ లో గనక అదితి కన్ఫర్మ్ అయితే నాని తో రెండవ సినిమా అవుతుంది. ఇక అదితి ని తీసుకునే విషయంలో నాని కూడా పాజిటివ్ గా ఉన్నాడట.
అలాగే ‘శ్యామ్ సింగ రాయ్’ లో మరో హీరోయిన్ ‘సాయి పల్లవి’ని తీసుకున్నారని ఇంతకముందే వార్తలు వచ్చాయి. ఇంతక ముందు నాని సాయి పల్లవి కలిసి ఎం.సి.ఎ లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సగ భాగం చిత్రీకరణ జరుపుకుందని సమాచారం.