ట్రెండింగ్ న్యూస్

రాత్రి 8 గంటలకు క్లబ్ కు పోయి.. ఉదయం 5 గంటలకు ఇంటికి వచ్చేవాడిని.. నవదీప్ షాకింగ్ వ్యాఖ్యలు

Why navadeep always called as party boy
Share

నవదీప్.. యంగ్ హీరో. 17 ఏళ్లకే హీరో అయ్యాడు. జై సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. సెన్సేషనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో మొదటి సినిమాలో నటించాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినా నవదీప్ సినిమాలకు సక్సెస్ రేట్ తక్కువ. అందుకే.. నవదీప్ స్టార్ హీరో కాలేకపోయాడు. కానీ.. ఆయన మంచి నటుడు. అడపా దడపా మంచి పాత్రలు వస్తే చేస్తున్నాడు. బుల్లి తెర మీద కూడా ప్రస్తుతం హడావుడి చేస్తున్నాడు నవదీప్.

Why navadeep always called as party boy
Why navadeep always called as party boy

నవదీప్ ఇటీవల ఆలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ లో ప్రముఖ కమెడియన్ ఆలీతో కలిసి తన గురించి తెలిపాడు. ఈనేపథ్యంలో.. ఆలీ.. నవదీప్ పర్సనల్, సినీ విషయాలను తెలుసుకున్నారు.

నవదీప్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో… విపరీతంగా పార్టీలకు వెళ్లేవాడట. ఎంతలా అంటే.. రోజూ రాత్రి 8 అయిందంటే చాలు… క్లబ్ కు పోయేవాడట. అర్ధరాత్రి అక్కడే ఉండి.. బిర్యానీ తిని.. తెల్లారక 5 గంటలకు ఇంటికి వచ్చేవాడట.

ఆ సమయంలో నవదీప్ రాత్రిళ్లు ఎక్కువగా పార్టీలు చేసుకుంటూ.. ఏదేదో చేస్తున్నాడంటూ మీడియాలో తప్పుడు కథనాలు వస్తుండటంతో… ఇక పార్టీల జోలికే పోలేదట.

అప్పట్లో ఎక్కువగా పార్టీలకు పోవడం వల్ల నవదీప్ ను ఇప్పటికీ పార్టీ బాయ్ అని పిలుస్తుంటారట. అయితే.. బిగ్ బాస్ షోకు వెళ్లేంత వరకు తన మీద ఓ అభిప్రాయం ఉండేదట. కానీ.. బిగ్ బాస్ తర్వాత తన అసలు క్యారెక్టర్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు తెలిసిందని నవదీప్ చెప్పుకొచ్చాడు.


Share

Related posts

Open school Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపి ప్రభుత్వ కీలక నిర్ణయం

somaraju sharma

పంచాయతి ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి

Siva Prasad

Daily Horoscope ఆగష్టు 27th గురువారం మీ రాశి ఫలాలు

Sree matha
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar