ప్రభాస్ తాజాగా తన 20 సినిమాకి రాధే శ్యామ్ టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ని వదిలాడు. తెలుగు తమిళం మళయాళం హిందీ భాషల్లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడం ఆసక్తికరం. జిల్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమైన రాధకృష్ణ కుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతుండగా పూజా హెగ్డే ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పణలో ఆయన కూతురు ప్రశీద తో పాటు యువి క్రియోషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు కలిసి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక ప్రభాస్ నుంచి ఒక అద్భుతమైన లవ్ స్టోరీ వచ్చి చాలా కాలమైంది. డార్లింగ్ సినిమా తర్వాత నుంచి అన్ని యాక్షన్ సినిమాలే చేస్తూ వస్తున్నాడు ప్రభాస్. సాహో లాంటి భారీ యాక్షన్ సినిమా తర్వాత కూడా ఒకరకంగా అభిమానులు గాని ప్రేక్షకులు గాని యాక్షన్ సినిమానే ఆశించారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యోంత వరకు అందరూ అదే అనుకున్నారు. కాని ఫస్ట్ లుక్ తో అందరికి కమ్ముకున్న మబ్బులు విడిపోయాయి. రాధే శ్యామ్ ప్యూర్ లవ్ స్టోరీ అని అర్థమైపోయింది. ఇందుకు కొంతమంది సంబరపడుతుంటే కొంతమంది మాత్రం కాస్త నిరుస్తాహపడుతున్నారట.
ఇదిలా ఉంటే రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ రిలీజై రికార్డ్ క్రియోట్ చేసింది. ఫస్ట్ లుక్ రిలీజైన కొన్ని గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ తో పాటు 3.8 మిలియన్ ట్వీట్స్ తో కొత్త రికార్డ్ క్రియోట్ చేసింది. అయితే ఈ ఫస్ట్ లుక్ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. కొంతమంది నెటిజన్స్ ఈ ఫస్ట్ లుక్ ని కంచె సినిమా పోస్టర్ తో పోలుస్తున్నారు. అలాగే దీపక పదుకొణె రన్ వీర్ సింగ్ సినిమాతోను పోలిక పెడుతున్నారు. ఎన్ని పోలికలు పెట్టిన ఇక్కడ ఎవరి క్రియోటివిటీ వాళ్ళది. ఒక్కో సినిమా పోస్టర్ ఆయా దర్శకుడి క్రియోటివిటీతో ఉంటుంది. కాని అందరీది ఒకే ధోరణి ఉండకపోవచ్చు కదా అంటూ ఇలా పోలికలు పెడుతున్న వారిని ఉద్దేశించి ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారట. ఇక డార్లింగ్ సినిమా తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఒక అద్భుతమైన ప్రేమ కథ తో వస్తున్నాడు ప్రభాస్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?