ఎందుకు ఎడమవైపే తిరిగి పడుకోవాలి?

మన జీవితంలో సంతోషం మనం నిద్రించే తీరు బట్టి ఉంటుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మనం కుడి వైపు కన్నా ఎడమవైపు తిరిగి నిద్రిస్తే మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుందని మరియు మన జీవితం ఆనందమయంగా ఉంటుందని ఓ సర్వేలో తేలింది. ఎడమవైపు తిరిగి పడుకునే వారు రాత్రుళ్లు సాధారణంగా మధ్యలో నిద్రలేవరట. వారికి చక్కని గాఢమైన నిద్ర పడుతుందని ఆ సర్వే నివేదిక సూచిస్తుంది. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ఎడమైపు తిరిగి నిద్రించడం ఎంత అవసరం, ముఖ్యమో మీరు గుర్తిస్తారు.

ఎందుకు ఎడమవైపే తిరిగి పడుకోవాలి?

మీకు మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటే భోజనం చేసిన రెండు గంటల తరువాత నిద్రపోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు కచ్చితంగా నిద్రపోవాలని నిపుణులు చెబుతన్నారు. ఏ కారణం వల్లన అయినా విశ్రాంతి తీసుకోవడం కుదరకపోతే వారు కనీసం పది నిమిషాల పాటు వజ్రాసనం వేయడం మంచిది.

ముఖ్యంగా రాత్రి వేళ భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్ర పోకూడదు. కనీసం రెండు గంటల అయినా మెలకువగా ఉండాలి. ఆ తర్వాత నిద్రపోవాలి. ఇలా చేస్తే డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం చాలా తక్కువని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

అలాగే పడుకునే విధానంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎడమ వైపుకి తిరిగి, ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకోవాలి. మానవ శరీరంలో సూర్యనాడి, చంద్ర నాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులు ఉంటాయి. సూర్యనాడి మన తిన్న భోజనాన్ని జీర్ణం చేస్తుంది. ఈ సూర్య నాడి మనం ఎడమ వైపు తిరిగి పడుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది.

ఎడమ వైపు తిరిగి పడుకొనే వారు అనేక వ్యాధులను నివారించుకొనే శక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా, గుండె సంబంధిత సమస్యలు మరియు అలసట నివారించుకోగలరు.కాబట్టి విశ్రాంతి మరియు మనశాంతి కోసం ఎడమవైపు తిరిగి పడుకోవడం చాలా ముఖ్యం. ఎడ‌మ‌వైపు తిరిగి పడుకోవడం అనేది ఆరోగ్యానికి ఎందుకు మంచిది అంటే జీర్ణాశయం, మూత్రాశయం, శోషరస గ్రంథులు, క్లోమం మన క‌డుపుకు ఎడమ వైపు ఉంటాయి కాబట్టి.

అందుకే అలసటకు గురైనప్పుడు ఇలా ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం ద్వారా అలసత్వం త్వరగా తొలగిపోతుంది. రోజంతా ఉత్సాహంగా ఉత్సాహంగా ఉండడానికి కూడా ఇది  చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఎడమవైపుకు తిరిగి నిద్రించడం ద్వారా మీకు గురక నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది. ఇలా చెయ్యడం వలన గర్భిణీ స్త్రీల గర్భాశయానికి, పిండానికి. మూత్రపిండాలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది.

అలాగే వెన్నునొప్పి, మెడనొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. శరీరంలోని వ్యర్థాలన్నీ చాలా తేలికగా తొలగిపోతాయి. కాలేయం మరియు మూత్రపిండాలు మెరుగ్గా పనిచేస్తాయి. జీర్ణక్రియ మెరుగు గా ఉంటుంది.. హృద్రోగాలకు మీరు చాలా దూరంగా ఉండవచ్చు. ఇలా చెయ్యడం వలన కొవ్వు పదార్ధాలు సైతం సులభంగా జీర్ణమవుతాయి. మెదడు చురుకుగా పని చేస్తుంది.