నిత్యామీనన్ మొదటిసారి నెగిటివ్ కామెంట్స్ ని అందుకుంటుంది. తను ఇప్పటి వరకు ఏ పాత్ర చేసినా వేలెత్తి చూపిచిన వాళ్ళు లేరు. అద్భుతమైన హీరోయిన్ అన్న ప్రశంసలు తప్ప ఇలాంటి వల్గర్ సీన్స్ కూడా చేస్తుందా అన్న వాళ్ళు ఇంతవరకు లేరనే చెప్పాలి. ఇప్పటి వరకు అలాంటి పాత్రలని నిత్యా చేయలేదు. తెలుగు, తమిళం, మళయాం సినిమాలు ఇప్పటి వరకు చాలానే చేసింది. కాని ఇన్ని ఏళ్లలో ఎప్పుడు కూడా వెండి తెరపై నిత్యామీనన్ శృతి మించింది లేదు.
తను నటించే సినిమాలలో పాత్ర, కాస్ట్యూమ్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. అవసరమైతే సినిమానే వదులుకుంది. ఇప్పటి వరకు పాత్రకు ప్రాధాన్యం, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేసిన నిత్యామీనన్ మొదటి సారి తన హద్దులు తానే చెరిపేసింది. ముద్దు సీన్ చేసి సంచలనం సృష్టించింది. అది కూడా మరో అమ్మాయితో. లెస్బియన్ గా నిత్యామీనన్ నటించి షాకిచ్చింది.
నిత్యామీనన్ తాజాగా అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించిన బ్రీత్ అనే వెబ్ సిరీస్ లో విపరీతంగా రెచ్చి పోయింది. అందులో లెస్బియన్ గా నటించడంతో పాటు మరో అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించింది. ముద్దు సీన్ లో అదరగొట్టింది. అమ్మాయితో అయినా నిత్యామీనన్ ముద్దు సీన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మొదటి సారి ఈ ముద్దు సీన్ తో నిత్యామీనన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లో ఇన్ని రోజులు పద్దతిగా కనిపించిన నిత్యామీనన్ ఇప్పుడు వెబ్ సిరీస్ లో ఇలా ఎలా రెచ్చిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనికి నితా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.