తెలుగు బుల్లితెర పై కొన్ని జంటలు కాంట్రోవర్సియల్ గా నిలిచి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అటువంటి జోడిలే సుధీర్ – రష్మీ, వర్ష – ఇమ్మానుయేల్, అఖిల్ – మోనాల్, అవినాష్ – అరియనా. ఈ జోడీలు మన బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. అయితే టీవీ ఛానల్స్ కూడా వారిని హైలైట్ చేస్తూ వారిపై ప్రోగ్రామ్స్ ని చేస్తుంటే అవి చుసిన ప్రేక్షకులు వారు నిజజీవితంలో కూడా నిజంగా లవ్ చేసుకుంటున్నారేమో అనుకుంటున్నారు. ఇలా వచ్చిన రూమర్స్ పై వారు ఎంతగా క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రేక్షకుల ముందు షోస్ లో వారు లవర్స్ లాగా నటిస్తుండడం తో ప్రేక్షకుల సందేహాలు ఇంకా బలపడుతున్నాయి.
ప్రస్తుతం వర్షిణి, హైపర్ ఆది లది కూడా ఇటువంటి జంటే. ఒకప్పుడు ఢీ షో లో వీరి రొమాన్స్ ని చుసిన ప్రేక్షకులు నిజంగానే వీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారా అని అనుకున్నారు. అలాగే, వీరిద్దరూ బయట కూడా అలానే ఉంటారు అని వార్తలు వచ్చాయి.
హైపర్ ఆది మాత్రం వర్షిణిని చాలా సిన్సియర్ గానే ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అంటున్నారు నెటిజన్లు. కానీ వర్షిణి మాత్రం ఆదిని అస్సలు పట్టించుకోకుండా బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ కి క్లోజ్ గా ఉంటుందట. ఇది తెలిసిన హైపర్ ఆది, అభిజీత్ కి వార్నింగ్ ఇచ్చారట. ముఖ్యంగా అభిజీత్ కూడా వర్షిణి విషయంలో కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో ఆదికి కోపం వచ్చిందట. ఇంతకముందే అభిజీత్ మరియు వర్ష ఇద్దరూ కలిసి పెళ్లి గోల రెండు సీజన్లలో కలిసి నటించారు. వీరి బంధం అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉందట. ఈ నేపథ్యంలో మధ్యలో హైపర్ ఆది వచ్చినా వర్షిణి మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ప్రస్తుతం ఇండస్ట్రీ లో వర్షిణి విషయంలో హైపర్ ఆది ని సైడ్ తీసుకోమని అభిజిత్ వార్నింగ్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.