NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

హైకోర్టు+కేంద్రం+ గ‌వ‌ర్న‌ర్‌+ప్ర‌తిప‌క్షాలు…ఎంత మందితో చెప్పించుకుంటావు కేసీఆర్‌?

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఈ మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతోంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఒక‌టి.

స్వ‌‌త‌హాగా డాక్ట‌ర్ అయిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తెలంగాణలోని ప‌రిణామాల‌పై స్పందించారు. క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ తెలంగాణ స‌ర్కారుకు మింగుడు ప‌డ‌ని కామెంట్లు చేశారు. కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. గవర్నర్ తమిళిసై ఓ ఇంటర్వ్యూలో ఈ మేర‌కు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గవర్నర్​ మేడం ఇప్పటికే…

కరోనా ఉధృతిని తెలంగాణ‌ ప్రభుత్వం అంచనా వేయలేక పోయిందని గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై అన్నారు. కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సూచనలు చేస్తూ, ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్ తమిళిసై ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే టెస్టులు చేస్తున్నామని…ప్రభుత్వం సమర్ధించుకుంటోందని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ అన్నారు. కట్టడి ప్రాంతాల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆమె అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కోవిడ్ చికిత్స తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారిందన్నారు. అన్ని వసతులు సమకూర్చామని ప్రభుత్వం చెబుతున్నప్ప‌టికీ ప్రభుత్వాస్పత్రుల పై రోగులు ఆసక్తి చూపట్లేదని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ విశ్లేషించారు.

తెలంగాణ‌ హైకోర్టు, కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షాలు….

కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమైనప్పుడు ఈ విషయాలను గట్టిగానే చెప్పానని తమిళిసై  ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడమే పరిష్కార మార్గమని, మొబైల్ టెస్టింగ్‌లు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు  తమిళిసై అన్నారు. కాగా ఇప్ప‌టికే తెలంగాణ‌ హైకోర్టు, కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షాలు క‌రోనా విష‌యంలో త‌మ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా గ‌వ‌ర్న‌ర్ ఈ మేర‌కు స్పందించారు.

మళ్లీ అదే విధంగా….

ఇదిలాఉండ‌గా, తెలంగాణలో మంగ‌ళ‌వారం నాడు కొత్తగా 1682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 93,937 కు చేరింది. నిన్న మరో 8 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 711కి చేరింది.  నిన్న ఒక్కరోజే 2070 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  72,202 కు చేరింది. ఇంకా 21,024 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.14,110 మంది హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు.  ఇండియాలో కరోనా రికవరీ రేటు 72.51 ఉండగా.. తెలంగాణలో 76.86 గా ఉంది. ఈ  కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 235 ,రంగారెడ్డిలో 166, వరంగల్ అర్బన్ 107,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 106 కేసులు నమోదయ్యాయి.

 

author avatar
sridhar

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju