ఆర్ ఆర్ ఆర్ నుంచి రెండు టీజర్లు వచ్చాక ఈ టాక్ ఎందుకు మొదలైంది ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. కాగా ఎప్పుడైతే ఈ సినిమా ప్రారంభం అయిందో అటు మెగా ఫాన్స్, ఇటు నందమూరి ఫాన్స్ మధ్య ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.

Bheem for Ramaraju-RRR(Telugu)-Happy Birthday Ram Charan/NTR,Ajay Devgn/SS Rajamouli - YouTube

ముఖ్యంగా ఏ హీరోకి సినిమాలో ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ హాట్ టాపిక్ ఇంతకు ముందు చరణ్ పోషిస్తున్న రాజరాజు టీజర్ రిలీజ్ అయినప్పుడు లేదు గాని రీసెంట్ గా తారక్ పోషిస్తున్న కొమరం భీమ్ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి మొదలైంది. అందుకు కారణం రెండు టీజర్స్ లో చరణ్ రామరాజు టీజర్ కే ఎక్కువగా బజ్ క్రియోటవడమే.

వాస్తవంగా చూస్తే ఇటీవల రిలీజైన తారక్ టీజర్ కూడా అద్భుతంగా ఉంది. చాలా మంది ఇలానే ప్రశంసలు కురిపించారు కూడా. కాని నందమూరి ఫ్యాన్స్ లో మాత్రం ఏదో వెలితి కనిపిస్తోంది. అందుకే ఇలా కంపేర్ చేసుకొని ఫీలవుతున్నారట. దాంతో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎవరి క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందన్నది ఇప్పుడు చర్చించుకుంటున్నారట. అయితే వాస్తవంగా మాత్రం ఇద్దరి పాత్రలు సరి సమానంగా ఉంటాయని ఇప్పటికే రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

Ramaraju For Bheem - Bheem Intro - RRR (Telugu) | NTR, Ram Charan, Ajay Devgn, Alia | SS Rajamouli - YouTube

అయినా మెగా ఫ్యాన్స్ ఒకవైపు నందమూరి ఫ్యాన్స్ ఒకవైపు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది. బాహుబలి సినిమాలో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తర్వాత తారక్, చరణ్ ల ఇద్దరి అదే రేంజ్ క్రేజ్ వస్తుందని మేకర్స్ నమ్మకంగా చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా రిలీజైయ్యాక ఎలాంటి సంచనాలని క్రియోట్ చేస్తుందో.