ధర్మాన కృష్ణదాస్ కు బూతులు మాట్లాడేంత కోపం ఎందుకు వచ్చింది ?

Share

ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది. ఎంతోకాలంగా ఎమ్మెల్యేగా,ఏడాదిన్నర కాలంగా మంత్రిగా ఉన్న ఏ రోజూ ఇంత సీరియస్గా రియాక్ట్ గాని ధర్మాన కృష్ణదాస్ ఒక్కసారిగా బాబుపై మండిపడ్డారు.

బాబుని పట్టుకుని ఘాటు విమర్శలే చేశారు. ఒక దశలో ఊగిపోతూ మీడియాలో కూడా రాయలేని విధంగా బూతులే వాడారు.చెడా మడా తిట్టేసారు.విశాఖ నుంచి చంద్రబాబు పోటీ చేసి గెలవాలని కూడా ధర్మాన కృష్ణ దాస్ సవాల్ చేశారు. బాబు ఎక్కడ నిలబడితే తాను అక్కడ నుంచి పోటీ చేస్తానని కూడా ధర్మాన కృష్ణ దాస్ చాలెంజి చేశారు. బాబుని తాను ఓడించి తీరుతానని, ఒకవేళ అలా జరగకపోతే రాజకీయ సన్యాసమేనని కూడా ఆయన స్పష్టం చేశారు. బాబు ఓడితే అమరావతి అన్న మాట మానుకోవాలని కూడా సూచించారు. నిజంగా దాసన్నేనా ఇలా మాట్లాడింది అని మీడియా కూడా చెక్ చేసుకోవాల్సింది వచ్చిందంటే దాసన్న కోపం ఎంతగా హద్దులు దాటిందో చేసుకోవచ్చు.

 

కాగా ఆయన అంతగా ఓవర్ రియాక్ట్ ఎందుకయ్యారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. దీనికి రాజకీయ పరిశీలకులు కారణాలు చూపిస్తున్నారు.కృష్ణదాస్ సొంత జిల్లా శ్రీకాకుళం నుంచే ఏపీ టిడిపి కొత్త ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు రాబోతున్న తరుణంలో మంత్రి దూకుడు పెంచారని, తన వ్యవహారశైలిని మార్చుకున్నారని, తద్వారా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఆకట్టుకునే ప్రయత్నం సాగించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మెత్తగా ఉంటే ఎవరైనా మొట్టి పోతారని తెలుసుకున్న మంత్రి కృష్ణదాస్ తానేమీ తక్కువ తినలేదని సంకేతాన్ని చంద్రబాబునాయుడు,అచ్చం నాయుడులకి ఇచ్చారంటున్నారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ బూతులు మాట్లాడం మంచిది కాదని సొంత పార్టీలో నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే జగన్ క్యాబినెట్ లో ఒక మంత్రికి బూతుల మంత్రి అన్న పేరు ఉంది. ఆయన కారణంగానే జగన్ ప్రభుత్వానికి కొన్ని రకాల ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ధర్మాన ప్రసాదరావు కూడా బూతులకి దిగితే లాభం కన్నా నష్టమే ఎక్కువ శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నారు. పర్ఫామెన్స్ లో ప్రతిభ చాటుకోవాలి తప్ప ప్రత్యర్థులపై పరుషపదజాలం వాడి ప్రజల్లో పలుచన అవడం మంత్రికి మంచిది కాదని చెబుతున్నారు.

 


Share

Related posts

పైసల్ కట్టు… స్నానం చెయ్ : ఏపీ ప్రభుత్వం వింత వైఖరి

Special Bureau

ప్రపంచానికి షాకింగ్ న్యూస్..! కరోనాపై చైనా దొంగాట..! లీకైన రహస్య పత్రాలు..!?

Vissu

Corona: బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ వైసీపీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం..!!

sekhar