Samantha: టాలీవుడ్‌లో ఆ నిర్మాణ సంస్థలు అన్నీ సమంతను బ్యాన్ చేస్తాయా..! ఇకపై అవకాశాలు కావాలంటే..?

Share

Samantha: ‘ఏ మాయ చేశావే’ అంటూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సమంత నిజంగానే రీల్ లైఫ్‌లో కోట్ల ప్రేక్షకులను..రియల్ లైఫ్‌లో అక్కినేని నాగ చైతన్యను ఎంతగా మాయ చేసిందో అందరికీ తెలిసిందే. మొదటి సినిమా నుంచే ప్రేమలో పడిన ఈ క్రేజీ కపుల్..కొంతకాలం డీప్ లవ్‌లో మునిగి తేలారు. వారు కలిసి చేసిన ప్రతీ సినిమాలో పెదవి ముద్దు ఉండాల్సిందే. దాంతో క్రేజ్ కి క్రేజ్..పాపులారిటీకి పాపులారిటీ. అలా అన్నీ వర్గాల ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు సమంత, నాగ చైతన్య. వీరు ప్రేమలో ఉన్నప్పటి నుంచే అభిమానులే కాదు వేలమంది అభిమానులు ఇద్దరు ఒక్కటైతే చూడాలనుకున్నారు.

will all the production companies ban samantha movies...?
will all the production companies ban samantha movies…?

అలాగే సమంత, నాగ చైతన్య రెండు కుటుంబాలను ఒప్పించి రెండు మతాల సాంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా సినీ ప్రముఖులు, అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్ళి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా నాగ చైతన్య, సమంత ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చూడ ముచ్చటి చక్కటి జంటలల్లో సామ్, చైతూలదీ ఒకటి. ఇటు అక్కినేని, అటు దగ్గుబాటి ఫ్యామిలీలకి బంధువుగా మారి ఇండస్ట్రీలో రెండు పెద్ద ఫ్యామిలీల సపోర్ట్ పొందింది. సమంతకి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం కూడా ఇచ్చారు.

Samantha: సమంతనే ట్రోల్ చేయడం, నెగిటివ్ కామెంట్స్ చేయడం చేస్తున్నారు.

నాగార్జున ఫ్యామిలీ సమంతను ఏ లోటూ లేకుండా చూసుకుందని కూడా చెప్పుకునేవారు. సినిమాల పరంగా సమంత తీసుకున్న నిర్ణయాన్ని వారు గౌరవించారు కూడా. పెళ్లికి ముందు సమంత ఎలాంటి గ్లామర్ రోల్స్ చేసినా, పెళ్లి తర్వాత మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తనను తాను మార్చేసుకుంది. మజిలీ, ఓ బేబీ, జానూ, ఇప్పుడు శాకుంతలం వంటి కథా బలమున్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ సాగుతోంది. బిగ్ బాస్ గత సీజన్‌లోనూ నాగార్జున వైల్డ్ డాగ్, సినిమా షూటింగ్ వల్ల హోస్ట్ చేయలేకపోతే ఆ వారాలు కోడలుగా వచ్చి సమంత రీ ప్లేస్ చేసి ఆకట్టుకుంది.

నాగార్జునను ముద్దుగా మామా అని పిలుస్తూ అల్లరి పనులు చేసింది. ఇదంతా చూసిన అభిమానులు కొన్ని సందర్భాలలో పొంగిపోయారు. ఇంతగా తనని మార్చుకున్నా కూడా సమంత, నాగ చైతన్యలకి ఎక్కడ విబేధాలు తలెత్తాయో గానీ నెలరోజులు పైగానే వేరే వేరు ఇంట్లో ఉంటూ అభిమానులకి మేము విడిపోబోతున్నామని హింట్ ఇస్తూ వచ్చారు. అలాగే అక్టోబర్ 2న ఇద్దరు అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు. సమంత, నాగ చైతన్య విడిపోతున్నామని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఎక్కువగా సమంతనే ట్రోల్ చేయడం, నెగిటివ్ కామెంట్స్ చేయడం చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు ఇద్దరికి మద్దతు ఇస్తుంటే కొందరు మాత్రం వేరేగా సపోర్ట్ చేస్తున్నారు.

Samantha: ఇకపై సమంత అటు కోలీవుడ్ ఇటు బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసుకోవాల్సిందే..?

ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో ఇంతకాలం సమంత చేసిన పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఇక అవకాశాలు దక్కడం కష్టమనే టాక్ కూడా వినిపిస్తోంది. ఖచ్చితంగా అన్నపూర్ణ, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అయితే అవకాశాలు దక్కడం అంటే అయ్యే పనికాదంటున్నారు. ఇక దిల్ రాజు, అల్లు అరవింద్ సహా మిగతా బడా నిర్మాణ సంస్థల నుంచి కూడా సమంతకి అవకాశాలు రావడం దాదాపు కష్టమని చెప్పుకుంటున్నారు. ఇకపై సమంత అటు కోలీవుడ్ ఇటు బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసుకోవాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Share

Related posts

బ్రేకింగ్ : కరోనా కి వ్యాక్సిన్ కనిపెట్టిన తొలి దేశంగా భారత్..! విడుదల ఎప్పుడంటే….

arun kanna

మాటల మాంత్రికుడి చేతుల మీదుగా వనవాసం…

Siva Prasad

అత్యాచారం కేసులో 13 ఏళ్లకు శిక్ష

sarath