Allu arjun: పుష్ప రాజ్.. భీమ్లా నాయక్ ను తక్కువ చేసి మాట్లాడతాడా..? ప్రస్తుతం మెగా అభిమానుల్లో ఉన్న ఆలోచన ఇదే. దానికి కారణం లేకపోలేదు. గత ఏడాది చివరిలో అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియన్ సినిమా పుష్ప పార్ట్ 1 వచ్చి విడుదలై న 5 భాషలలో భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారాడు. అంతేకాదు ప్రభాస్ తర్వాత టాలీవుడ్లో పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న హీరో అంటే అల్లు అర్జున్ అని అందరూ చెప్పుకుంటున్నారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అనుకున్న క్రేజ్ సాధించారు కూడా. పుష్ప అక్కడ
100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది.
ఇప్పుడు బన్నీ మావయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ హిందీలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే హిందీ వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయగా బాలీవుడ్ ప్రేక్షకులను ఈ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత పవన్ సినిమా ఇప్పుడు హిందీలో రిలీజ్ కాబోతుండటంతో అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. టాలీవుడ్లో పవన్ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి ప్రభంజనం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమాను చేయకపోయినా కూడా ఆ రేంజ్ క్రేజ్ పవన్ సాధించారు.
Allu arjun: అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారు..!
ఇక గత నెల వచ్చిన భీమ్లా నాయక్ సినిమాకు తెలుగు ఇండస్ట్రీలోనీ స్టార్ హీరోలతో పాటు మిగతా వారంతా ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపు అందరూ ఈ సినిమాను చూశారు. కానీ, ఇంకా అల్లు అర్జున్ మాత్రం చూడలేదు. తాజాగా ఆయన కూడా భీమ్లా నాయక్ సినిమాను మహేశ్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీలో చూసినట్టు సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి భీమ్లా నాయక్ సినిమాపై, మావయ్య పవన్ కళ్యాణ్, అలాగే మరో హీరో రానాలపై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారు..ఎలాంటి కామెంట్స్ చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.