Vijay devarakonda-Anand devarakonda: అన్న విజ దేవరకొండ మాదిరిగా పాన్ ఇండియన్ క్రేజ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు రాదా..?

Share

Vijay devarakonda-Anand devarakonda: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క మెగా ఫ్యామిలీ నుంచే 10 మంది హీరోలు వచ్చారు. అలాగే నాగార్జున, బాలయ్య, కృష్ణ, మోహన్ బాబు సహా పెద్ద కుటుంబాల నుంచి నట వారసులు వచ్చి సక్సెస్ సాధిస్తున్నారు. ఎంత వారసత్వం అని చెప్పుకున్నా అది మొదటి సినిమాకే పనికొస్తుంది. రెండవ సినిమా నుంచి సొంతగా అవకాశాలు దక్కించుకోవాల్సి.. వాటితో సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలి. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ హీరోలు చాలా శ్రమిస్తుంటారు అని చాలా మంది అభిప్రాయం.

will Anand devarakonda meets Vijay devarakonda range...?
will Anand devarakonda meets Vijay devarakonda range…?

మెగా హీరోలెవరైనా ఒక సినిమా కమిటైతే ఆ సినిమాలో ఉన్న ఫైట్, డాన్స్ కోసం కొన్ని సందర్భాలలో ఒళ్ళు హూనం చేసుకుంటుంటారు. కాళ్ళు చేతులు ఫ్యాక్చర్ అయిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఎన్.టి.ఆర్ కూడా తన డాన్స్‌తో మెప్పించడానికి ఎంత కష్టపడతాడో అందరికీ తెలిసిందే. యమదొంగ సినిమా సమయంలో కాలు కూడా ఫ్యాక్షర్ అయిందని వార్తలు వచ్చాయి. రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా వచ్చిన ప్రభాస్ మొదట్లో కొన్ని విమర్శలు ఎదురుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన పాన్
ఇండియన్ స్టార్. ప్రపంచంలో హాలీవుడ్ హీరోలు కూడా తీసుకోని విధంగా రోజుకు 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరుకున్నాడు.

Vijay devarakonda-Anand devarakonda: ఏకంగా రౌడీ హీరో అనే ఇమేజ్ సంపాదించుకున్నాడు.

ఇలా నట వారసులెవరైనా కష్టపడకుండా స్టార్ అయినవాళ్ళు ఎవరూ లేరనే చెప్పాలి. ఇదే క్రమంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ముందు నాని నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు అనే సినిమాలో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో చాలా డీసెంట్ రోల్ చేసిన ఆయన ఆ తర్వాత అర్జున్
రెడ్డి అనే ఎగ్రెసివ్ స్టోరీతో వచ్చి ఏకంగా రౌడీ హీరో అనే ఇమేజ్ సంపాదించుకున్నాడు.

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకి వచ్చిన క్రేజ్ అసాధారణం. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ మేకర్స్‌ను అక్కడ హీరోయిన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. చెప్పాలంటే అర్జున్ రెడ్డి విజయ్ దేవకొండకి బాలీవుడ్ రేంజ్ లో క్రేజ్ తీసుకు వచ్చింది. ఆ తర్వాత గీత గోవిందం మంచి క్లాసీ హిట్ గా నిలిచింది. ఇలా ఇండస్ట్రీకి హీరోగా వచ్చిన అతికొద్ది కాలంలోనే విజయ్ దేవరకొండ స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గనక
హిట్ అయితే ఇక విజయ్ రేంజ్ మామూలుగా పెరగదు.

Vijay devarakonda-Anand devarakonda: ఆనంద్ దేవరకొండకి ఇప్పట్లో చాలా కష్ఠమనే మాట వినిపిస్తోంది.

అయితే ఆ రేంజ్ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండకి వస్తుందా అంటే డౌటే అని టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ఆనంద్ ఎంచుకునే కథలు చాలా సున్నితంగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలు గానీ నటించబోతున్న సినిమాలు గానీ మాస్ ఆడియన్స్‌ను మెప్పించేవిగా ఉండటం లేదని చెప్పుకోవడమే. విజయ్ దేవరకొండ మాదిరిగా హైపర్ యాక్టివ్‌గానూ ఆనంద్ కనిపించడం లేదంటున్నారు. అందుకే విజయ్ దేవరకొండకి వచ్చిన పాన్ ఇండియన్ స్టార్ క్రేజ్ ఆయన తమ్ముడు
ఆనంద్ దేవరకొండకి రావాలంటే ఇప్పట్లో చాలా కష్ఠమనే మాట వినిపిస్తోంది. చూడాలి మరి తమ్ముడిని విజయ్ దేవరకొండ ఎలా లాక్కొస్తాడో.


Share

Related posts

ఈడీ ఎదుట చిదంబరం

Siva Prasad

Huzurabad By Poll: కాంగ్రెస్, బీజేపీపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు‌..!!

somaraju sharma

Pawan Kalyan: ఇక ఇప్పుడు పవర్ స్టార్ అభిమానుల టైం దగ్గర పడింది…??

sekhar