NewsOrbit
Featured న్యూస్ సినిమా

Anand Devarakonda: విజయ్ దేవరకొండ తమ్ముడుకి అర్జున్ రెడ్డి లాంటి సినిమా పడాల్సిందేనా..?

Anand Devarakonda: టాలీవుడ్‌లో రౌడీ హీరోగా అసాధారణమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అలా కనిపించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత ఎవడే సుబ్రమణ్యం సినిమాలో చేసిన పాత్రతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో వచ్చిన గుర్తింపుతో ఆయనకి పెళ్ళి చూపులు సినిమాలో అవకాశం దక్కింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతూవర్మ హీరోయిన్‌గా నటించింది. పెళ్ళి చూపులు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ సక్సెస్ అందుకుంది.

will anand-devarakonda-should act in arjun reddy like movie
will anand devarakonda should act in arjun reddy like movie

ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి మంచి క్రేజే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ద్వారక ఓ మాదిరిగా ఆడినప్పటికీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఊహించని సంచలనం సృష్ఠించింది. శాలినీ పాండే హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన ఈ సినిమా రిలీజ్‌కు ముందే చిన్న వివాదాలను సృష్ఠించింది. కాంగ్రెస్ లీడర్ వి హనుమంత రావు అర్జున్ రెడ్డి మూవీ పోస్టర్ చూసి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఇది పెద్ద దుమారం అయింది. అయితే, ఇదే సినిమాకు ప్రమోషన్ జరిగి బాగా హైప్ వచ్చింది. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకున్నారు.

Anand Devarakonda: విజయ్ తమ్ముడిగానే ఇంకా ఆనంద్‌ను చూస్తున్నారు..!

ఇలా అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్‌కు ముందే వార్తల్లో నిలవడం యూత్ ఆడియన్స్‌లో బాగా విజయ్ దేవరకొండకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక సినిమా రిలీజ్ ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నందిని రెడ్డి లాంటి వారు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్, విజయ్ దేవరకొండ మాట్లాడిన విధానం మరింతగా బజ్ క్రియేట్ చేసింది. ఇక అర్జున్ రెడ్డి మూవీ రిలీజయ్యాక ఓ సునామీలాంటి క్రేజ్ విజయ్ దేవరకొండకు వచ్చేసింది. బోల్డ్ సీన్స్ ఉన్నా కూడా అవి కథలో చాలా బలంగా ఉండటంతో అదే సినిమాకు హైలెట్ అయింది. ఈ సినిమాతో ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే కాదు బాలీవుడ్‌లో భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది.

ఇలాంటి సినిమా ఒకటి ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ పడాల్సిందే అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. విజయ్ దేవరకొండ చేసిన పెళ్ళి చూపులు, ద్వారక వంటి క్లాస్ సినిమాలు ఆనంద్ దేవరకొండ చేస్తున్నాడు. మొదటి సినిమా దొరసాని అతనికి మంచిపేరే తెచ్చింది. ఆ తర్వాత చేసిన మిడిల్ క్లాస్ మెలోడీస్ కూడా యూత్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. కానీ విజయ్ తమ్ముడిగానే ఇంకా ఆనంద్‌ను చూస్తున్నారు గానీ..సోలో ఇమేజ్ వచ్చినట్టుగా మాత్రం అనిపించడం లేదు. ఆ ఇమేజ్ నుంచి మారి సొంతగా తనకొక సపరేట్ ఇమేజ్ రావాలంటే ఆనంద్ దేవరకొండకు అర్జున్ రెడ్డి లాంటి ఓ సాలీడ్ హిట్ పడాలి.

Anand Devarakonda: విజయ్ దేవరకొండ రేంజ్ క్రేజ్ రావడానికి చాలా ఏళ్ళు సమయం పడుతుందా..?

కానీ ఇంకా అలాంటి ప్రాజెక్ట్ ఏదీ ఆనంద్ దేవరకొండ చేస్తున్నట్టు తెలియడం లేదు. ప్రస్తుతం పుష్పక విమానం అనే సినిమాను చేశాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి వారు ఆనంద్ దేవరకొండ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఆనంద్ ఎలాంటి ఇమేజ్ దక్కించుకుంటాడో గానీ ఇప్పటి వరకు చేసిన సినిమాలే ఇకపై కూడా కంటిన్యూ చేస్తే విజయ్ దేవరకొండ రేంజ్ క్రేజ్ రావడానికి చాలా ఏళ్ళు సమయం పడుతుందని టాక్ వినిపిస్తోంది.

Related posts

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu