Anil ravipudi : అనిల్ రావిపూడి ..ఇప్పుడున్న టాలీవుడ్ డైరెక్టర్స్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. రాజమౌళి ఇండస్ట్రీకొచ్చి స్టార్స్ తో సూపర్ హిట్స్ తీసి పాన్ ఇండియన్ డైరెక్టర్ గా పాపులర్ అయ్యాడు. పాన్ ఇండియన్ క్రేజ్ ప్రభాస్ కి ఇచ్చాడు. ఇప్పటి వరకు రాజమౌళి ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు. అందుకే ఆయనను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అంటున్నారు. ఇక ఇదే దారిలో కొనసాగుతున్న మరొక దర్శకుడు కొరటాల శివ. డార్లింగ్ ప్రభాస్తో మిర్చి సినిమా తీసి దర్శకుడిగా మారడమే కాదు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమా నుంచి గత చిత్రం భరత్ అనే నేను వరకు అన్నీ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.
ఆయనతో సినిమా చేసిన హీరోలకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. వీరిద్దరిని ఫాలో అవుతున్నాడు అనిల్ రావిపూడి. ఎక్కువగా ఎంటర్టైనర్స్ తీస్తున్నాడు. తీసిన ప్రతీ సినిమా హిట్. పటాస్ తో సినీ ఇండస్ట్రీకొచ్చిన అనిల్ రావిపూడి సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలు తీశాడు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టడమే కాదు వరుస ఫ్లాపుల్లో ఉన్న మాస్ మహారాజ రవితేజకి భారీ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ఎఫ్ 3 అనే సినిమాను రూపొందిస్తున్నాడు.
Anil ravipudi : శర్వానంద్ ఉన్న పరిస్థితుల్లో అనిల్ రావిపూడి అయితే మంచి సక్సెస్ దక్కుతుందట.
మెగా హీరో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, తమన్నా, యంగ్ బ్యూటీ మెహ్రీన్ హీరో, హీరోయిన్స్ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది అన్నీ అనుకున్నట్టు పూర్తి అయితే రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా పూర్తి చేశాక అనిల్ రావిపూడి..టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ని డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. శర్వానంద్ మంచి హిట్ అందుకొని చాలా కాలం అయింది. ఇప్పుడు శర్వానంద్ ఉన్న పరిస్థితుల్లో అనిల్ రావిపూడి అయితే మంచి సక్సెస్ కొడతాడని నమ్మకంగా ఉన్నాడట శర్వానంద్. మరి హిట్ దక్కుతుందో లేదో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?