Anu Emmanuel: గ్లామర్ డోస్ ఎంత పెంచినా ఆ సినిమా సక్సెస్ కాకపోతే అను ఇమ్మాన్యుయేల్ కెరీర్‌కి పెద్ద రిస్కే

Share

Anu Emmanuel: నాని సినిమాలో నటించిన హీరోయిన్స్‌కి టాలీవుడ్‌లో మంచి అవకాశాలే దక్కుతాయని చెప్పుకుంటుంటారు. కానీ అది కొంతమంది విషయంలో కరెక్ట్ కాదనిపిస్తోంది. అందుకు ఉదాహరణ అను ఇమ్మాన్యుయేల్. ఈమె ముందు మలయాళ సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యాక్షన్ హీరో బిజు అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అదే సంవత్సరం టాలీవుడ్‌లో నాని నటించిన మజ్ఞు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. అయినా అను ఇమ్మాన్యుయేల్ కి బాగానే తెలుగులో అవకాశాలు వచ్చాయి.

will anu-emmanuel-glamour dose increases opportunities for her career
will anu-emmanuel-glamour dose increases opportunities for her career

ఆ అవకాశాలను వదులుకోకుండా కమిటై స్టార్ హీరోయిన్‌గా మారేందుకు ట్రై చేస్తోంది. కానీ ఆమె అనుకున్నంత స్టార్ స్టేటస్ మాత్రం దక్కడం లేదు. సినిమా సినిమాకి తనలోని గ్లామర్ డోస్ ఎంతగా పెంచుతుందో ఆమె సినిమాలు చూస్తున్న వారికి సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారికి బాగా తెలుస్తుంది. మొదటి సినిమా మజ్ఞు ఫ్లాప్ తర్వాత రాజ్ తరుణ్‌తో కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమాలో నటించింది. అలాగే మాచో హీరో గోపీచంద్ సరసన ఆక్సిజన్ సినిమాలో నటించింది. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ చేసిన గ్లామర్ రోల్స్ జనాలకి అంతగా ఎక్కలేదు.

Anu Emmanuel: అను ఇమ్మాన్యుయేల్ కి మైనస్ అయ్యాయి.

సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్స్ కావడంతో ఆ సినిమాలు అను ఇమ్మాన్యుయేల్ కి మైనస్ అయ్యాయి. దాంతో ఇక టాలీవుడ్‌లో ఈమె కెరీర్ క్లోజ్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోలు నటించిన సినిమాలలో అవకాశాలు అందుకొని షాకిచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించింది. మరొక హీరోయిన్‌గా కీర్తి సురేశ్ నటించింది. సినిమా భారీ డిజాస్టర్ అయినప్పటికీ కాస్తో కూస్తో పేరొచ్చిందంటే కీర్తికే.

అజ్ఞాతవాసి అను ఇమ్మాన్యుయేల్ కి మాత్రం అసలు ఉపయోగపడలేదు. ఇక రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారుతూ తెరకెక్కించిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఈ సినిమా జనాలకి పెద్దగా ఎక్కలేదు. ఇలా కెరీర్ ప్రారంభం నుంచి అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న సినిమాలన్నీ సక్సెస్ కాక అవకాశాలు అందుకోవడంలో వెనకపడింది. మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా కూడా అను ఇమ్మాన్యుయేల్ కి హిట్ ఇవ్వలేకపోయింది.

Anu Emmanuel: వీరందరికీ ఈ సినిమా హిట్ అనేది తప్పనిసరి.

ప్రస్తుతం ఈమె చేతిలో మహా సముద్రం సినిమా ఒకటే ఉంది. దీనిమీదే అను ఇమ్మాన్యుయేల్ ఆశలన్నీ పెట్టుకుంది. ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందితున్న ఈ సినిమాలో శర్వానంద్ – సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా సక్సెస్ దర్శకుడు అజయ్ భూపతికి, శర్వానంద్, సిద్దార్థ్‌లకి, హీరోయిన్స్ అనూ ఇమ్మానియేల్, అదిథి రావు హైదరికీ చాలా కీలకం. వీరందరికీ ఈ సినిమా హిట్ అనేది తప్పనిసరి. ఈ ఒక్క సినిమా రిజల్ట్ గనక తేడా కొడితే మాత్రం అందరికీ ఇబ్బందే. ఏమవుతుందో చూడాలి.


Share

Related posts

బార్క్ నోటిఫికేషన్ ..

bharani jella

ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ లో ఖాళీలు ..

bharani jella

నేడే సిబిఐ బాస్ ఎంపిక

somaraju sharma