Dil raju: ఆర్ఆర్ఆర్ సినిమాను సోలోగా రిలీజ్ చేసేందుకు..మిగతా సినిమాలను బరి నుంచి తప్పించేందుకు మేకర్స్ ఎన్ని రకాల ప్లాన్స్ వేయాలో అన్నీ రకాలా ప్లాన్స్ వేస్తున్నారు. కానీ అక్కడ ఉంది పవర్ స్టార్. ఒకసారి డిసైడయితే ఇక నో ఛేంజ్..నో డిస్కరషన్. అందుకే సితార ఎంటర్టైన్మెంట్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్ సినిమాను ముందు ప్రకటించిన 2022, జనవరి 12నే రిలీజ్ చేస్తామని తాజాగా మరోసారి పోస్టర్ వదిలి మరీ కన్ఫర్మేషన్ ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమా భీమ్లా నాయక్ కంటే 5 రోజులు ముందుగా వస్తోంది. అలాగే రాధే శ్యామ్ సినిమాకంటే వారం రోజులు ముందుగా వస్తోంది. అయితే రాధే శ్యామ్ ప్రభావం ఏమీ ఉండకపోయినా ఖచ్చితంగా పవర్ స్టార్ పవర్ ఉన్న భీమ్లా నాయక్ సినిమా ఎఫెక్ట్ మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీగానే పడే అవకాశాలున్నాయి. థియేటర్స్ సమస్య వస్తుందనుకున్నా కూడా సురేశ్ బాబుకు ఉన్న థియేటర్స్ మొత్తం తీసుకొనైనా భీమ్లా నాయక్‌ను రిలీజ్ చేసేయొచ్చు. అంటే ఇక్కడ వస్తుంది థియేటర్స్ సమస్య కాదు. భారీ బడ్జెట్‌తో తీసిన ఆర్ఆర్ఆర్ వసూళ్ళ మీద నాయక్ ఎక్కడ ప్రభావం చూస్తాడో అని.
Dil raju: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా ప్లాన్ చేస్తున్నారు.
ఎవరు చెప్పినా అటు పవన్ కళ్యాణ్ గానీ..ఇటు సితార వారు గానీ ఏమాత్రం కాంప్రమైజ్ అవడం లేదట. అందుకే ఇప్పుడు నిర్మాత అండ్ డిస్ట్రిబ్యూటర్ను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గత చిత్రానికి నిర్మాత దిల్ రాజు. ఆ రకంగా పవన్‌తో దిల్ రాజు మాట్లాడితే కన్విన్స్ అవుతాడేమోనని ఓ చిన్న హోప్ ఆర్ఆర్ఆర్ మేకర్స్‌కు ఉందట. మరి పవన్ కళ్యాణ్ దిల్ రాజు మాట వింటాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అసలు ఉండకూడదు. ఉంటే దెబ్బ గట్టిగానే పడుతుందనేది ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే అర్థమవుతోంది.