Bigg boss 4 : బిగ్ బాస్ 4 సీజన్ ఎంత హిట్టో అందరికీ తెలుసు. మిగితా సీజన్ కన్నా ఈ సీజన్ సూపర్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం అయితే ఈ సీజన్ కంటెస్టెంట్లు. అవును.. పోయిన సీజన్ల కన్నా.. ఈ సీజన్ కంటెస్టెంట్లు చాలా స్పోర్టివ్. అందులోనూ ఈ సీజన్ లో లవ్ స్టోరీలు, బ్రేకప్ లు, గొడవలు, విరోధాలు, ఫ్రెండ్ షిప్స్.. ఇలా ఒకటేమిటి.. అన్నీ మిళితం అయిపోయిన సీజన్ ఇది. అందుకే.. ఈ సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
బిగ్ బాస్ 4 గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది అఖిల్, మోనల్ ప్రేమ గురించి. అవును.. ముందుగా ట్రైయాంగిల్ టైప్ లో ఉన్న ఈ లవ్ స్టోరీ.. తర్వాత డబల్ యాంగిల్ కు మారింది. అఖిల్, అభిజీత్, మోనల్.. ఈ ముగ్గురి మధ్య నడిచిన ఈ కథ.. చివరకు అఖిల్, మోనల్ తో పుల్ స్టాప్ పడింది.
అఖిల్ కు మోనల్ అన్నా.. మోనల్ కు అఖిల్ అన్నా చాలా ఇష్టం. ఇన్ ఫాక్ట్.. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా చాలా సందర్భాల్లో ప్రేక్షకులకు తెలిసిపోయింది. కానీ.. వాళ్లు మాత్రం అస్సలు బయటపడలేదు. వాళ్ల లవ్ స్టోరీ గురించి బిగ్ బాస్ సీజన్ 4 ను ఫాలో అయిన ప్రతి ఒక్కరు చెబుతారు.
Bigg boss 4 : బీబీ ఉత్సవంలో మరోసారి తెర మీదికి వచ్చిన అఖిల్, మోనల్ లవ్ స్టోరీ
తాజాగా స్టార్ మాలో బీబీఉత్సవం ప్రోగ్రామ్ జరిగింది కదా. ఈనేపథ్యంలో మరోసారి వీళ్ల ప్రేమ గురించి చర్చ వచ్చింది. ఎందుకంటే.. ఈ ఉత్సవంలో ఇద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం.. మోనల్ కోసం అఖిల్ పాట పాడటం.. మోనల్ కాలికి అఖిల్.. గజ్జలు తొగడటం.. ఇవన్నీ చూస్తుంటే వీళ్లిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉంది.. అనే అనిపిస్తుంది. వీళ్లది ఉత్తుత్తి ప్రేమ అయితే కాదు.. వీళ్లు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు.. అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు చూద్దం మరి.. వీళ్లు పెళ్లి చేసుకుంటారా? లేక రాహుల్, పునర్నవి జంటలా అయిపోతారా?