Calcutta: చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్‌( Pawan kalyan)లకు కలిసొచ్చిన కలకత్తా బ్యాక్ డ్రాప్ నాని( Nani)కి కలిసొస్తుందా..?

Share

Calcutta: కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన మన టాలీవుడ్ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan,) నటించిన సినిమాలుండటం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్(Guna shekar) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), సౌందర్య, అంజలా ఝవేరీ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా అంతకముందు చిరు నటించిన పసివాడి ప్రాణం సినిమా ఆధారంగానే మళ్ళీ చూడాలని ఉంది(Chudalani undi) సినిమాను తెరకెక్కించాడు గుణశేఖర్(Guna shekar). అయితే ఈ సినిమాకి గుణశేఖర్(Guna shekar) తీసుకున్న కలకత్తా బ్యాక్ డ్రాప్ ఫ్రెష్‌గా ఉండటంతో అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

will Calcutta back drop suits nani....?
will Calcutta back drop suits nani….?

చూడాలని ఉంది(Chudalani undi) సినిమాలోను మొదటి పాట యమహానగరి, ఫస్ట్ ఫైట్..ఆ తర్వాత వచ్చే కీలక సన్నివేశాలు కలకత్తా నేపథ్యంలోనే వస్తాయి. అయితే అన్నీ సన్నివేశాలను చిత్ర బృందం కలకత్తా వెళ్ళి షూట్ జరపలేదు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో కలకత్తా నగరంలో ఉండే పెద్ద అపార్ట్మెంట్ సెట్‌ను నిర్మించి చిత్రీకరణ జరిపారు. అలా ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో రూపొంది మంచి కమర్షియల్ హిట్ సాధించింది. మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. కొన్ని సన్నివేశాలకి కలకత్తా నేపథ్య సంగీతం ఇచ్చి మంచి ఫీల్ క్రియేట్ చేశారు.

Calcutta: కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన చూడాలని ఉంది(Chudalani undi), ఖుషి( Khushi )సినిమాలకి మణిశర్మ సంగీత దర్శకుడు.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan) నటించిన ఖుషి( Khushi )సినిమా కూడా కలకత్తా నేపథ్యంలో కొంత సాగుతుంది. పవన్ కళ్యాణ్( Pawan kalyan) కి సంబంధించిన సన్నివేశాలు కొన్ని కలకత్తా నేపథ్యంలోనే దర్శకుడు ఎస్ జే సూర్య తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఎ మేరా జహా సాంగ్ కూడా ఆ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ భూమిక ఖుషి( Khushi )సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో పవన్ కళ్యాణ్( Pawan kalyan), భూమిక మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదే సినిమా మూడు భాషలలో రూపొందినా కూడా తెలుగులో అయినంత హిట్ మిగతా తమిళ, హిందీ భాషలలో కాలేకపోయాయి.

ముఖ్యంగా ఖుషి( Khushi )సినిమా అంటే అమ్మాయే సన్నగా, గజ్జ ఘల్లుమన్నాదిరో..ఆడువారి మాటలకి అర్థాలే వేరులే సాంగ్స్ బాగా గుర్తొస్తాయి. ఇక నువ్వు గుడుంబా సత్తి ఏంటీ.. నేను సిద్దూ సిద్దార్థా రాయ్ ..వంటి డైలాగులు..ఇంట్రవెల్ బ్లాక్ ఫైట్..భూమిక నడుము సీన్..క్లైమాక్స్ ..ఇలా ప్రతీది ఖుషి( Khushi )సినిమా సక్సెస్‌కి బాగా కలిసి వచ్చాయి. ఇక ఇక్కడా యాదృశ్చికం ఏంటంటే కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన చూడాలని ఉంది(Chudalani undi), ఖుషి( Khushi )సినిమాలకి మణిశర్మ సంగీత దర్శకుడు. ఇప్పుడు ఇదే బ్యాక్ డ్రాప్‌లో నాని( Nani), సాయి పల్లవి, కృతి శెట్టి మడోనా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్న శ్యామ్ సింగ రాయ్ కూడా కలకత్తా బ్యాక్ డ్రాప్ కావడం.

Calcutta: నానికి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.

ఈ సినిమా కూడా కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే గత కొంతకాలంగా నానీ( Nani)కి సరైన సక్సెస్ దక్కడం లేదు. ఇప్పుడు కొత్త తరహా కథతో తెరకెక్కిన శ్యాం సింగ రాయ్ సినిమాతో రాబోతున్నాడు. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా బాగానే కేటాయించారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న నానీ( Nani)కి కలకత్తా బ్యాక్ డ్రాప్ కలిసి వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. మరి నాని( Nani)కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించాడు.


Share

Related posts

ఢిల్లీ ప్రార్థనల్లో 800 మంది ! తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరగనున్నాయా ?

Siva Prasad

మోదీ స్కెచ్ మాములుగా ఉండదు మరీ!!

Comrade CHE

రెండు క్లైమాక్స్‌లు..

Siva Prasad