Prabhas – Chiranjeevi: సైరాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన మెగాస్టార్ ప్రభాస్‌ను బీట్ చేయగలరా..?

Share

Prabhas – Chiranjeevi: బాహుబలి సినిమాల తర్వాత మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఓవరాల్ సౌత్‌లో పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ సంపాదించుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్. ఆయన తీసిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి కన్‌క్లూజన్ సినిమాలతో ప్రభాస్‌కి పాన్ ఇండియన్ రేంజ్‌లో మార్కెట్ ఏర్పడింది. ప్రభాస్‌తో సినిమా అంటే ఇప్పుడు కథ యూనివర్సల్‌గా ఉండాలి. ఆ సినిమాను తెరకెక్కించే దర్శకులు, హీరోయిన్.. ఇతర నటీ నటులు, టెక్నీషియన్స్, సినిమాను నిర్మించే నిర్మాత భారీ బడ్జెట్‌ను కేటాయించాల్సిందే.

will Chiranjeevi beats Prabhas with pan indian movie...?
will Chiranjeevi beats Prabhas with pan indian movie…?

అయితే తెలుగులో ప్రభాస్ తర్వాత పాన్ ఇండియన్ సినిమాను చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 10 ఏళ్ళకి ముందు నుంచి ఉన్న మెగాస్టార్ డ్రీమ్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్‌లో టైటిల్ పాత్ర పోషించడం. ఈ పాత్రలో నటించేదుకు 10 ఏళ్ళుగా కలగన్నారు. ఆ కల నెరవేర్చడానికి చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ ముందుకు వచ్చి సొంత నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకుడిగా సైరా సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Prabhas – Chiranjeevi: మెగాస్టార్‌కి ప్రభాస్ రేంజ్ క్రేజ్ వచ్చిందా అంటే నిర్మొహమాటంగా లేదనే చెప్పక తప్పదు.

అయితే బాహుబలి సినిమాలకి వచ్చిన రేంజ్‌లో పేరు రాలేకపోయింది. మెగాస్టార్ సైరా సినిమాలో నటించడానికి, ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మించడానికి కారణం రాజమౌళి. పాన్ ఇండియన్ సినిమాలకు తెలుగులో ఆయన వేసిన బాట. మనం కూడా పాన్ ఇండియన్ సినిమాలను తీయెచ్చు. మన సినిమాకి ఆ సత్తా ఉందని రాజమౌళి నిరూపించడంతో మెగాస్టార్ సైరాను దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించి తెరకెక్కించారు. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్‌కి ప్రభాస్ రేంజ్ క్రేజ్ వచ్చిందా అంటే నిర్మొహమాటంగా లేదనే చెప్పక తప్పదు.


మరీ చిరు నుంచి రాబోతున్న సినిమాలతోనైనా ఆ క్రేజ్ వస్తుందా అంటే కూడా చెప్పలేని పరిస్థితి. అందుకు కారణం ప్రభాస్ ఎంచుకున్న జోనర్ సినిమాలకి మెగాస్టార్ కమిటయిన జోనర్ సినిమాలకి అంత తేడా ఉంది కాబట్టి. ప్రభాస్ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘రాధే శ్యామ్’ సినిమాను ఇటీవలే పూర్తి చేశాడు. ఇదొక వింటేజ్ లవ్ స్టోరి. దాదాపు 250 కోట్ల బడ్జెట్. దీని తర్వాత చేస్తున్న సలార్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. దీని బడ్జెట్ కూడా 200 కోట్లని అంటున్నారు.

Prabhas – Chiranjeevi: ప్రభాస్‌ను మెగాస్టార్ ఏ రకంగానూ బీట్ చేయలేరని అర్థమవుతోంది.

ఇక బాలీవుడ్‌లో చేస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. దాదాపు 650 కోట్ల బడ్జెట్‌తో ఓం రౌత్ రూపొందిస్తున్నాడు. దీనిని పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేస్తున్నారు. అలాగే ప్రాజెక్ట్ కె. దీని బడ్జెట్ కూడా 500 కోట్లని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ రూపొందిస్తుండగా, దీనిని పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇటీవల స్పిరిట్ అనే సినిమాను ప్రకటించాడు. ఇది కూడా పాన్ వరల్డ్ మూవీగా 9 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే మెగాస్టార్ చేస్తున్న వాటిలో పాన్ ఇండియన్ స్థాయిలో కమిటయినవి ఏవీ లేవు. పైగా భోళా శంకర్, గాడ్ ఫాదర్ సినిమాలు పరభాషా రిమేక్ సినిమాలే. ఇక బాబీతో చేస్తున్న సినిమా స్ట్రైట్ మూవీ. కాబట్టి ప్రభాస్‌ను మెగాస్టార్ ఏ రకంగానూ బీట్ చేయలేరని అర్థమవుతోంది.


Share

Related posts

Vijay : ఆ వార్త నిజం కాదు.. విజయ్ సినిమాలో నటిస్తానన్న బాలీవుడ్ హీరో..?

Teja

‘ఆపరేషన్ గుణపాఠం’ మొదలెట్టిన జగన్! ఇది అల్లాటప్పా ప్రాజెక్టు కాదు !!

Yandamuri

కన్నకొడుకు భార్యను పెళ్లి చేసుకున్న మామ.. ట్విస్ట్ ఏంటంటే?

Teja