YS Jaganmohan Reddy: 2024 టార్గెట్..! చంద్రబాబు చేసిన తప్పు.. జగన్ చేస్తారా..!?

will cm jagan follow chandrababu naidu
Share

YS Jaganmohan Reddy: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి YS Jaganmohan Reddy 2019 ఎన్నికల్లో గెలుపొందిన తీరు అద్వితీయం. కేవలం ఎన్నికల హామీలు ఇచ్చినంతనే అటువంటి విజయం సాధ్యమవదు. దశాబ్దంగా జగన్ ఒంటరి పోరాటం, పార్టీపై, నాయకుడి తీరుపై పార్టీ నాయకులకు స్థానికంగా ఉన్న బలం, వారి పని తీరు ప్రజలకు నచ్చితేనే అటువంటి గెలుపు సాధ్యం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా జగన్ తనదైన ముద్ర వేసి ముందుకెళ్తున్నారు. ఈక్రమంలో ఆయన గెలుపుకు రెండేళ్ల కాలం పూర్తైంది. అప్పుడే 2024 ఎన్నికల గురించి పార్టీలు ప్రణాళికలు వేసుకునే టైమ్ వచ్చేసింది. మరో ఏడాది గడిస్తే.. ఇక టార్గెట్ 2024 అనే చెప్పాలి. ఈక్రమంలో గతంలో చంద్రబాబు చేసిన తప్పును జగన్ చేయకుండా ఉంటారా?

will cm jagan follow chandrababu naidu
will cm jagan follow chandrababu naidu

చంద్రబాబుకు విజనరీ నాయకుడనే పేరు ఉంది. పాలనను, అధికార యంత్రాంగాన్ని పరుగు పెట్టించి పని చేయించేవారు. అయితే.. ఓదశలో ఆయనకు వచ్చిన ఈ పేరే ఆయనకు మరేదీ ఆలోచించేలా చేయలేదు. మొత్తం అధికార వ్యవస్థపైనే ఆధారపడ్డారు. క్షేత్రస్థాయిలో నాయకుల తీరు, ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభిప్రాయం.. ఇలా ఏదీ ఆయన లెక్కలోకి తీసుకోలేదు. 1995లో అధికారం చేపట్టిన తర్వాత 1999లో గెలవడానికి ఆయన పాలనే కారణం. అదే ఊపులో 2004 వరకూ వెళ్లారు కానీ.. పార్టీని పట్టించుకోలేదు. 2014-19లో కూడా ఆయన కేవలం అమరావతి, పోలవరం అనే అంశాలు.. కేంద్రంతో పోరాడి ప్రజల్లో సింపతీ తెచ్చుకోవడం అనే డిఫెండింగ్ గేమ్ లో ఉండిపోయారు. పార్టీని, కార్యకర్తల్ని పట్టించుకోలేదు. అధికారులు ఇచ్చిన ర్యాంకింగ్స్, వాళ్లపైనే ఎక్కువ ఆధారపడి తీవ్ర నష్టం చూశారు.

Read More: Telugu desam Party: టీడీపీలో మార్పులు జరుగుతున్నాయా..? యువతరం వస్తోందా..!?

ఇప్పుడు జగన్ కూడా సీఎం హోదాలో అధికారులపై, పథకాలపై, పాలనపైనే ఆయన ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది కానీ.. క్షేత్రస్థాయిలో నాయకుల తీరుపై సమీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. పార్టీలో అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టకనే ఇప్పటికే ఎన్నో ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్టైంది. ఏడాదికోసారైనా పార్టీ సమీక్షలు, పథకాల అమలులో స్థానిక నాయకులకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజల్లోకి వెళ్తే నమ్మకం మరింత కలుగుతుంది. ఈ రెండేళ్లలో పార్టీ సమీక్షలు నిర్వహించలేదు. రచ్చబండతో ప్రజల మధ్యలోకి వెళ్దామంటే కరోనా పరిస్థితులు అడ్డుకున్నాయి. గత అనుభవాలను పరిశీలిస్తే.. వచ్చే మూడేళ్లలో అయినా నాయకులను, కార్యకర్తల్ని కలుపుకుని.. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి ముందుకెళ్లాలి. అప్పుడే టార్గెట్ 2024 సాధ్యం..!

 


Share

Related posts

జియో నుంచి 4 వేలకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్.. త్వరలో మార్కెట్ లోకి?

Varun G

ఇండియా పై నోరు పారేసుకున్న డోనాల్డ్ ట్రంప్..!!

sekhar

మంత్రి పెద్దిరెడ్డికి కరోనా

Special Bureau