Rangasthalam: రంగస్థలం లాంటి ప్రయోగాలు ప్రతీసారి వర్కౌట్ అవుతాయా..?

Share

Rangasthalam: ప్రస్తుతం సినిమా స్కేల్ మారిపోయింది. కంటెంట్‌లో ఎంత బోల్డ్‌నెస్ ఉంటే అంతగా జనాలను ఆకట్టుకోవచ్చు. ఒకప్పుడు ఇదే తరహాలోనూ సినిమాలొచ్చాయి. అప్పటి ట్రెండ్‌కు ఆ సినిమాలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే పక్కా కమర్షియల్ సినిమాలు చేసిన హీరో, హీరోయిన్స్ ఉన్నారు. పాత్ర డిమాండ్ చేస్తే మాధవీ విజయశాంతి లాంటి అగ్ర నటీమణులు కూడా గ్లామర్‌గా కనిపించడానికి వెనకాడేవారు కాదు. అందుకే అప్పటి తరం హీరోయిన్స్ అన్నీ పాత్రల్లో నటించి ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకునేలా వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు.

will-experiments-like-rangasthalam-works-out-everytime
will-experiments-like-rangasthalam-works-out-everytime

దాదాపు అందరు హీరోయిన్స్ ఏదో ఒక సినిమాలో కథ డిమాండ్‌ను బట్టి కాస్తంత గ్లామరస్‌గా నటించినవారే. అయితే ఇప్పుడు గ్లామర్ పాత్రలడానికి లేదు. వాటినే బోల్డ్ అనే పదం పెట్టి పిలుస్తున్నారు. అందుకు కారణం ఇప్పుడు హీరోయిన్స్ చేస్తున్న పాత్రలలో వచ్చిన మార్పే అని చెప్పాలి. ఆర్.ఎక్స్.100 లాంటి సినిమాలలో గాటైన ముద్దు సన్నివేశాలు, హీరోతో రొమాన్స్ లాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. ఈ ఒక్క సినిమాలో మాత్రమే కాదు విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి లాంటి సినిమాలో యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే హై ఓల్టేజ్ రొమాంటిక్ సీన్స్ ఎన్ని ఉన్నాయో అందేరికీ తెలిసిందే.

Rangasthalam: సుకుమార్ సమంతను ఎంత డీ గ్లామర్‌గా చూపించినా ఆదరించారు.

కొన్ని యూత్ ఆడియన్స్ కోసం తీసే సినిమాలలో సన్నివేశాలైతే హద్దుమీరి మరీ చూపిస్తున్నారు. జనాలకు కూడా కావాల్సింది అదే. ఎంతగా ఆకట్టుకునే సన్నివేశాలుంటే అంతగా ఆ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో స్టార్ హీరోయిన్స్ కూడా కొన్ని సినిమాలలో కథ డిమాండ్ చేయడంతో ముద్దు సన్నివేశాలకు అడ్డు చెప్పడం లేదు. ప్రస్తుతం ఇది చాలా కామన్ అయిపోయింది. మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్స్ కూడా హీరోయిన్‌తో పెదవి ముద్దుకు సిద్దమవుతున్నారు. తప్పదు మరి అభిమానులు కోరుకున్నది చేయాల్సిందే.

సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలంలోనూ సమంత – రామ్ చరణ్‌ల మధ్య ఓ పెదవి ముద్దు సన్నివేశం ఉంది. కానీ సుకుమార్ చాలా అందంగా దీనిని చూపించాడు. ఇక రంగస్థలం సినిమా ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు పెద్ద రిస్క్ చేసినట్టే. అన్నీ డీ గ్లామర్ రోల్స్‌తో సినిమా అంటే ప్రేక్షకుల రియాక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలాకష్టం. రంగస్థలం అనే టైటిల్‌తోనే సినిమా నేటివిటీ అర్థమౌతుంది. కాబట్టే జనాలు చాలా ఈజీగా కనెక్ట్ అయ్యారు. సుకుమార్ సమంతను ఎంత డీ గ్లామర్‌గా చూపించినా ఆదరించారు. అనసూయను రంగమ్మత్తగా చూపించడం ఓ సాహసమే.

Rangasthalam: రంగస్థలం సినిమా మాదిరిగా పుష్ప ఆకట్టుకుంటుందా..?

అయితే అన్నీసార్లు ఇది వర్కౌట్ అవుతుందా..హీరోయిన్స్ అందరూ డీ గ్లామర్ రోల్స్‌కు సూటవుతారా..జనాలు ఆదరిస్తారా అంటే అది కంప్లీట్‌గా దర్శకుడు రాసుకున్న కథ..అందులో నేపథ్యం..పాత్రల మీదే ఆధారపడి ఉంటుంది. మృగరాజు లాంటి సినిమాలు జనాలను ఆకట్టుకోలేకపోయాయి. మరి రంగస్థలం సినిమా మాదిరిగా పుష్ప ఆకట్టుకుంటుందా అనేది సినిమా రిలీజైతేగానీ చెప్పడానికి లేదు. ఇప్పటికైతే పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక మందన్న, తాజాగా విడుదలైన మంగళన్ శ్రీనుగా సునీల్.. దాక్షాయణిగా అనసూయ లుక్స్‌కు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. చూడాలి మరి వీరికి పుష్ప ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.

 


Share

Related posts

Bigg Boss 5 Telugu: మళ్లీ రీ ఎంట్రీ అంటున్న శ్వేత..!!

sekhar

Pawan Kalyan : ఇది అరాచకమైన అప్డేట్..! అబ్బాయ్ రామ్ చరణ్ చిత్రంలో బాబాయ్ పవన్ కళ్యాణ్…!

arun kanna

నీహారిక వేడుక జోహారిక..! మెగా తనయకు మెమొరబుల్ వేడుక..!!

bharani jella