Faria abdullah: జాతిరత్నం హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకి రవితేజ, శర్వానంద్, నాని సినిమాలలో హీరోయిన్ అన్నారు..పాపం ఇప్పుడు ఏమైంది..?

Share

Faria abdullah: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే చాలు ఇక ఆమెకి వరుసగా అవకాశాలివ్వడానికి దర్శక, నిర్మాతలు క్యూ కడతారు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ అని యంగ్ హీరోలు కూడా కొత్తగా వచ్చిన అమ్మాయిని తీసుకోమని దర్శక నిర్మాతలకి సూచిస్తుంటారు. ఇంకేముంది ఒక్క సినిమా హిట్ అయ్యే సరికి వరుసగా మూడు నాలుగు సినిమాలలో అవకాశాలు అందుకొని తీరిక లేనంత బిజీగా మారిపోతారు. రెండవ సినిమా నుంచే రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం కూడా మొదలు పెడతారు. అయినా సక్సెస్ అందుకున్న హీరోయిన్ అని నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోతారు.

will-faria-abdullah-get-chance-in-raviteja-sharwanand-nani-movie
will-faria-abdullah-get-chance-in-raviteja-sharwanand-nani-movie

జాతిరత్నాలు సినిమా తర్వాత కూడా హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి కూడా అదే అందరూ అనుకున్నారు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌ను ప్రస్తుతం ఏలుతున్న కృతి శెట్టి మాదిరిగా ఫరియాకి కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయని చెప్పుకున్నారు. కృతి శెట్టిని మించి పోతుందని ఆమెకి ఫరియా గట్టి పోటీ ఇస్తుందని టాక్ వినిపించింది. కట్ చేస్తే ఎక్కడ కృతి శెట్టి ఎక్కడ ఫరియా అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారట. ఉప్పెన సినిమా పెద్ద బ్యానర్స్‌లో తెరకెక్కిన సినిమా. పైగా దానికి మెగ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉంది. ఇందులో హీరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.

Faria abdullah: ఫరియా చాలా నమ్మకాలు పెట్టుకుంది.

దాంతో కృతి శెట్టి మీద అందరీ దృష్ఠి గట్టిగా పడింది. మొదటి సినిమా నుంచి ఆమెకి క్రేజీ యంగ్ హీరోలు కన్నేసి ఉంచారు. సినిమా హిట్ అని టాక్ వస్తే వెంటనే అడ్వాన్స్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే ఉప్పెన ఊహించని విషంగా భారీ హిట్ సాధించింది. 100 కోట్ల క్లబ్‌లో చేరి 25 ఏళ్ళ నుంచి ఉన్న రికార్డ్స్ అన్నీ తారుమారు చేసింది. దాంతో ఉప్పెన సినిమా రిలీజ్ అయ్యాక నాని నటిస్తున్న శ్యాం సింగరాయ్, సుధీర్ బాబు నటిస్తున్న ఆ అమ్మాయి గురించి చెప్పాలి, రామ్ నటిస్తున్న సినిమా, నాగార్జున, నాగ చైతన్యల బంగార్రాజు, నితిన్ కొత్త సినిమా.. ఇలా వరుసబెట్టి సినిమాలకి సైన్ చేసేసింది.

అయితే జాతి రత్నాలు తర్వాత ఇలాంటి ఫ్లోలోనే ఫరియా అబ్దుల్లా అవకాశాలు అందుకుంటుందని ప్రచారం జరిగింది. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ లాంటి నిర్మాత, వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ..జాతి రత్నాలు కూడా చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ సాధించింది. కాబట్టి అందరి దృష్ఠిలో ఫరియా అబ్దుల్లా బాగానే పడింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ దక్కింది. కానీ ఆమె ఆశించినంతగా అవకాశాలు దక్కడం లేదనేది లేటెస్ట్ టాక్. ఫరియా చాలా నమ్మకాలు పెట్టుకుంది. వరుసగా యంగ్ హీరోల సరసన అవకాశాలు వస్తాయని.

Faria abdullah: ఫరియా అవకాశాల కోసం ఎదురు చూస్తుందని తెలుస్తోంది.

అందుకు కారణం జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ టాక్ రాగానే శర్వానంద్ సరసన నటించే అవకాశం దక్కిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు నేచురల్ స్టార్ నాని కొత్తగా నిర్మిస్తున్న మ్యూట్ క్యూట్ అనే సినిమాలోనూ, అలాగే ఆయన సరసన హీరోయిన్‌గానూ ఫరియాకి ఛాన్సులు వచ్చాయని అన్నారు. మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న కొత్త సినిమాలలో కూడా ఫరియా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందని చెప్పుకున్నారు. కానీ రవితేజ, శర్వానంద్, నానీ సినిమాలలో ఈమె పేరు కనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం ఫరియా అవకాశాల కోసం ఎదురు చూస్తుందని తెలుస్తోంది. మరి ఈ చిట్టి ఎందుకు రేస్‌లో వెనకబడిందో.

 


Share

Related posts

Anasuya: భారీ ట్విస్ట్ ..అనసూయ ఇంటికి రాబోతున్న కోట శ్రీనివాసరావు…?

Ram

Poorna New Gallerys

Gallery Desk

తేనె తుట్టె కదిపిన వైసీపీ ఎంపీ మాధవ్..! అనంతలో ఏం జరుగుతుందో..!?

somaraju sharma