Genelia: టాలీవుడ్‌లో మళ్ళీ జెనీలియా వస్తే అవకాశాలిస్తారా..?

Share

Genelia: జెనీలియా..టాలీవుడ్‌లో హాసినిగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. జెనీలియా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి పార్కర్ పెన్ యాడ్ లో నటించింది. ఈ యాడ్ తో జెనీలియా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అంతేకాదు జెనీలియా కెరీర్‌లో ఇదొక మరపురాని సంఘటన. దాంతో జెనీలియా బాలీవుడ్ మేకర్స్ దృష్ఠిలో పడింది. అలా ఆమె మొదటి సినిమా హిందీలో నటించే అవకాశం అందుకుంది. ‘తుజే మేరి కసం’ అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో బాయ్స్ అనే సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

will-genelia-gets-a-chance-in-tollywood
will-genelia-gets-a-chance-in-tollywood

ఈ సినిమాతో జెనీలియా ఒకేసారి అటు తమిళం, ఇటు తెలుగు దర్శక, నిర్మాతల దృష్టిలో పడింది. బాయ్స్ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా జెనీలియాకి మాత్రం కోలీవుడ్, టాలీవుడ్‌లో బాగానే క్రేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమా చూసిన నాగార్జున తన మేనల్లుడు సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు. సూర్య కిరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించింది. దాంతో జెనీలియా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. వరుసగా తెలుగులో క్రేజీ మూవీస్ లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

Genelia: టాలీవుడ్‌లో జెనీలియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది.

2004లో హిందీలో మస్తీ, తెలుగులో సాంబ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత జెనీలియా తెలుగులో నటించిన సుభాష్ చంద్రబోస్, నా అల్లుడు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. దాంతో ఇక జెనీలియా పని అయిపోయింది అనుకున్నారు. కానీ అనూహ్యం గా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి నితిన్ హీరోగా తెరకెక్కించిన సై సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా జెనీలియాకి మంచి హిట్ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వచ్చిన హ్యాపీ సినిమాలో నటించి మరో హిట్ అందుకుంది. దాంతో అమ్మడికి మళ్ళీ అవకాశాలు క్యూ కట్టాయి.

ఈ క్రమంలోనే సిద్దార్థ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాదు హాసినిగా మారిపోయింది. బొమ్మరిల్లు తర్వాత జెనిలీయా కంటే హాసినిగానే బాగా పాపులర్ అయింది. ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ జెనీలియాకి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అదే సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ ఢీ, రెడీ సినిమాలు చేసి వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంది. దాంతో టాలీవుడ్‌లో జెనీలియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది.

Genelia: ఆ అదృష్ఠం జెనీలీయాకి ఉందా..?

అయితే అనూహ్యంగా ఆమె నటించిన ఆరెంజ్ భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో అన్ని సంవత్సరాలు జెనీలియా సంపాదించుకున్న క్రేజ్ మొత్తం ఒక్కసారిగా పడిపోయింది. ఈ సినిమా తర్వాత ఎన్నో నమ్మకాలు పెట్టుకొని నా ఇష్టం అనే చేసింది. ఈ సినిమా కూడా జెనీలియాకి కలిసి రాలేదు. ఆ తర్వాత పెళ్ళి చేసుకొని సినిమాలకి దూరమయింది. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి తెలుగు సినిమాలలో నటించే అవకాశాలు వస్తే ఒప్పుకోవాలని చూస్తుందట. ఇప్పుడు జెనీలియాకి హీరోయిన్‌గా అవకాశాలు దక్కడం కష్టమే. అలా అని ఆమె అమ్మ వదిన పాత్రలకి సరిపోదు. కుదిరితే సీనియర్ హీరోలకి జంటగా ఛాన్స్ వస్తే అదృష్ఠం. మరి ఆ అదృష్ఠం జెనీలీయాకి ఉందా లేదా చూడాలి.


Share

Related posts

వివాదంలో ‘ఆదిపురుష్’..! సైఫ్ ఆలీఖాన్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్..!!

Muraliak

క్లాట్ – 2021 నోటిఫికేషన్.. వివరాలివిగో

bharani jella

Chandra Babu: చంద్రబాబు అరెస్టు పై కర్నూలు ఎస్పీ ఏమన్నారంటే..!?

somaraju sharma