Height Increase: పొట్లకాయ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎండలు మండి పోతున్నప్పుడు దీన్ని ఎక్కువగా తినడం వలన శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాదు దీనివల్ల ఉదర సంబంధిత వ్యాధులు కూడా తగ్గిపోతాయి. పొట్లకాయ లోఉండే పోటాషియం, జింక్ ఈ రెండు బీపీని అదుపులో ఉంచడానికి బాగా సహాయపడతాయి. షుగర్ తో బాధ పడేవారు పొట్లకాయను ఆహారం లో తీసుకోవడం వల్ల కిడ్నీ కి సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా రక్షణ కలుగుతుంది.
ఇది ఇలా ఉంటే చాలా మంది పొడవు పెరుగుతామనే అపోహతో పొట్లకాయ రసాన్ని మోతాదుకు మించి తాగుతుంటారు. పొడవు మాట అటుంచితే , అది శరీరానికి హాని చేస్తుంది.పొట్లకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పడుతుంది. వాంతులు వంటి సమస్యలకు కారణమవుతోంది. అంతేకాదు ఈ రసం తయారు చేసుకోవడానికి తగిన శుభ్రత పాటించకపోతే.. బ్యాక్టీరియా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ రసం తాగిన కొంతమంది కి వారి శరీర భాగాల లో వాపు కనిపించడం తో పాటు దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఏదైనా కారణం తో పొట్లకాయ రసం తాగాలి అని అనుకునేవారు రసం అసలు చేదుగా ఉండకుండా చూసుకోవాలి. పొట్లకాయలో ఉండే చేదు కడుపులో గ్యాస్ సమస్యలు వచ్చేలా చేస్తుంది.అటువంటి పరిస్థితిలో, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఆ రసంలో నల్ల ఉప్పు, పుదీనా ఆకులు ,నల్ల మిరియాలు పొడి, కలుపుకుని తాగడం వలన ఎలాంటి సమస్య ఉండదు. ఈ పొట్లకాయ రసాన్ని పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఈ రసం రోజుకి ఒక గ్లాసు కంటే ఎక్కువగా తీసుకోకూడదు.