NewsOrbit
న్యూస్

ఇది ఎప్పటికీ జగన్ మీద చెరిగిపోని ‘బ్యాడ్ రిమార్క్ ‘గా మిగిలిపోనున్నదా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం ప్రధానంగా ప్రభుత్వ సర్వీసు పింఛనుదారులపై పడింది.ఉద్యోగస్థులకు ఏదో విధంగా జీతాలు ఇవ్వగలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

 Will it remain a 'bad remark' that will never be erased on pics
Will it remain a ‘bad remark’ that will never be erased on pics

శుక్రవారం వరకు కూడా పింఛన్దారులకు పెన్షన్ చెల్లించలేదు.నిధులు లేకపోవటమే ఇందుకు కారణం.ఇంతకు ముందు వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలతో పాటు పింఛన్ దారులకు పెన్షన్లు కూడా ఒకటవ తారీఖునే చెల్లింపులు జరిగేవి.కానీ కరోనా వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. రెండు నెలల పాటు ఉద్యోగస్తులకు,పింఛనుదారులకు సగం జీతమే చెల్లించారు. ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లింపు దాదాపు జరగడం లేదు. గతంలో అయితే 12వ తేదీన పెన్షనర్లకు పింఛన్ చెల్లించారు. ఇక సెప్టెంబర్ విషయానికి వస్తే ఒకటో తేదీన మంగళవారం ఆర్బీఐలో బాండ్లను వేలం వేయడం ద్వారా రూ. మూడు వేల కోట్లను తీసుకొచ్చిన ప్రభుత్వం జీతాలు చెల్లించింది. కానీ పెన్షన్ల చెల్లింపు కోసం ఆ మెుత్తం సరిపోలేదు. ఉద్యోగుల జీతాల కోసం దాదాపుగా రూ. నాలుగు వేల కోట్లు,పెన్షన్ల కోసం రూ. పదిహేను వందల కోట్లు నెలకు అవసరం అవుతాయి.

ఉద్యోగుల జీతాలకు సరిపెట్టినా.. పెన్షన్ల కోసం.. పదిహేను వందల కోట్లు ఎక్కడి నుంచి తేవాలా అని ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధులు లేవు. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్తే ఆర్బీఐ రూ. పదిహేను వందల కోట్లు ఇస్తుంది. కానీ సీఎం జగన్ మాత్రం.. ఓవర్ డ్రాఫ్ట్ లాంటి అతి స్వల్ప సమయం ఉండే అప్పులపై ఆసక్తిగా లేరు. దీంతో వేస్ అండ్ మీన్స్ కింద ఆర్బీఐ నుంచి సేకరించాలని ఆర్థిక శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నిధులను సేకరించి శుక్రవారం తర్వాత పెన్షనర్లకు పెన్షన్లు అందించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ఏదైనా ఇబ్బంది వస్తే.. మంగళవారం మళ్లీ బాండ్ల వేలం వేసి… నిధులు సమీకరించి ఇచ్చే అవకాశం ఉంది.

ఏదేమైనా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షనర్లకు ప్రతీ నెలా టెన్షన్ తప్పడం లేదు. ఆలస్యంగా రావడమే కాదు..లాక్ డౌన్ పేరుతో రెండు నెలలు కోత విధించారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇస్తున్నా.. సమయానికి రావడం లేదు. రిటైరైన వారికి పెన్షనే ఆధారంగా ఉంటుంది. అనేక సమస్యలు ఉంటాయి. తమ జీవితాంతం సర్వీస్ చేసిన వారికి ప్రభుత్వం ఇలా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది. సామాజిక పింఛన్లను ఒకటో తారీఖున ఇంటికి వెళ్లి మరీ చెల్లిస్తున్న ప్రభుత్వం సర్వీసు పెన్షనర్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి ఇది జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది!

author avatar
Yandamuri

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju