Kajal agarwal: సొంత బిజినెస్‌లో కాజల్ అగర్వాల్(Kajal agarwal)..నిర్మాతగా సక్సెస్ అవుతుందా..?

Share

Kajal agarwal: లక్ష్మీ కళ్యాణం(Laxmi kalyanam) సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయింది కాజల్ అగర్వాల్(Kajal agarwal). నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా యావరేజ్ అనే టాక్ దగ్గరే ఆగిపోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ(Chandamama) సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ మేకర్స్‌ను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత సుమంత్ హీరోగా పౌరుడు అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత నితిన్‌తో ఆటాడిస్తా సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

will kajal-agarwal-get success as a producer
will kajal-agarwal-get success as a producer

ఈ సినిమా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. అయినా కాజల్ అదృష్ఠం వరించి ఏకంగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన భారీ బడ్జెట్ సినిమా మగధీర (Magadheera)  సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాంతో కాజల్ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. అన్నీ పెద్ద నిర్మాణ సంస్థలలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా దాదాపు అందరు తెలుగు హీరోలతో నటించింది.

Kajal agarwal: ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు అవుతున్నా కాజల్ అగర్వాల్(Kajal agarwal) క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

తెలుగులో మాత్రమే కాదు తమిళంలో స్టార్ హీరోలైన సూర్య, కార్తి, ధనుష్ లాంటి హీరోల సరసన నటించి కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది. ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు అవుతున్నా కాజల్ అగర్వాల్(Kajal agarwal) క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే క్రేజ్‌తో భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె అకౌంట్‌లో మెగాస్టార్ ఆచార్య(Acharya), నాగార్జున గోస్ట్ సినిమాలు..కమల్ హాసన్‌తో చేస్తున్న ఇండియన్ 2 సహా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక గత ఏడాది కాజల్ ..అత్యంత సన్నిహితుడు ..వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే.

అయినా సరే కాజల్ సినిమాల పరంగా కెరీర్ కొనసాగుస్తున్నారు. సినిమాలతో పాటు ఇటీవల డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చి వెబ్ సిరీస్‌లను చేస్తోంది. అంతేకాదు ఆమె ముంబైలో భర్తతో కలిసి వ్యాపారం కూడా మొదలుపెట్టింది. ఈ బిజినెస్‌తో పాటు ఆమె నిర్మాతగా మారడం ఇక్కడ విశేషం. సమంత, రకుల్ ప్రీత్ లాంటి చాలామంది స్టార్ హీరోయిన్స్ హీరోయిన్‌గా సినిమాలతో వచ్చిన ఆదాయాన్ని వేరే వ్యాపారలలో పెట్టి సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. అయితే నిర్మాణ రంగంలోకి వచ్చిన వారు చాలా తక్కువ. కానీ కాజల్ భర్త బిజినెస్ చూస్కుంటూనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించింది.

Kajal agarwal: కాజల్ అగర్వాల్(Kajal agarwal) నిర్మాణంలో వరుసగా సినిమాలు వస్తాయట.

ఈ సినిమా సంస్థతో మరో నిర్మాణ సంస్థను కలుపుకొని సినిమాను నిర్మించారు కాజల్. ఆ సినిమా పేరు మను చరిత్ర. ఈ సినిమాకు ఆమె సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాలో హీరోగా శివ కందుకూరి, హీరోయిన్‌గా మేఘా ఆకాష్ నటించారు. అగ్ర నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి కొడుకు కావడంతో ప్రాజెక్ట్ మీద భారీగా అంచనాలున్నాయి. మొదటిసారి నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్న కాజల్ అగర్వాల్(Kajal agarwal) నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమా గనక హిట్ అయితే ఖచ్చితంగా ఆమె నిర్మాణంలో వరుసగా సినిమాలు వస్తాయట.


Share

Related posts

ప్రభాస్ 21 కి దీపిక పదుకొణె అనున్స్‌మెంట్ క్రేజ్ తీసుకు రాలేదా ..?

GRK

క‌రోనా వైర‌స్… జ‌గ‌న్ పై ఆ మ‌చ్చ పోతుందా?

sridhar

ఫ్లాష్ న్యూస్… తాను రియల్ హీరో అని మరొకసారి నిరూపించుకున్న సూపర్ స్టార్

Kumar